amp pages | Sakshi

నిర్మాతల్లో ఐక్యత లేదన్న మోహన్‌ బాబు, స్పందించిన నిర్మాతల మండలి అధ్యక్షుడు

Published on Tue, 01/04/2022 - 14:11

Producers Council President C Kalyan Respond On Mohan Babu Comments: ఇండస్ట్రీ పెద్ద ఎవరనే అంశం ప్రస్తుతం టాలీవుడ్‌లో రచ్చకు దారి తీసింది. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికల సమయంలో లెవనెత్తిన అంశంపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. మా ఎన్నికల అనంతరం దీని ఊసే మరిచిపోయిన క్రమంలో తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండలేనని, ఇద్దరు గొడవ పడుతుంటే దాన్ని పరిష్కరించడానికి ముందుకు రానంటూ ఆయన చెప్పిన అనంతరం మోహన్‌ బాబు రాసిన బహిరంగ లేఖ హాట్‌టాపిక్‌గా మారింది.

చదవండి: ఇండస్ట్రీ పెద్ద అంశంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సుమన్‌

అప్పటి నుంచి పరిశ్రమకు పెద్ద ఎవరనే దానిపై సినీ ప్రముఖులు ఎవరి అభిప్రాయాన్ని వారు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో మోహన్‌ బాబు సినీ పరిశ్రమకు రాసిన లేఖలో ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు.. నిర్మాతలు.. డిస్ట్రీబ్యూటర్లు కాదన్నారు. అంతేగాక టికెట్ల విషయంలో అసలు ప్రొడ్యూసర్‌ కౌన్సిల్ సమస్యను భుజాల మీద వేసుకోకుండా ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేదంటూ నిర్మాతల్లో ఐక్యత లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన లేఖపై నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కల్యాణ్‌ స్పందించారు.

చదవండి: Radhe Shyam: ఊహించిందే నిజమైందా? దీని అర్థమేంటి డైరెక్టర్‌ గారూ..

ఆయన మాట్లాడుతూ.. ‘ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అన్ని సమస్యలపై ప్రభుత్వాలతో చర్చిస్తూనే ఉంది. మోహన్ బాబు ఫ్యామిలీ అంతా సినిమా రంగంలోనే ఉంది. ఆయన ముందుండి సమస్యని పరిష్కరిస్తానంటే ఆయన వెంట నడవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. నిర్మాతల్లో ఐక్యత లేనందు వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని మోహన్ బాబు అన్నారు. అయితే మోహన్ బాబు కూడా నిర్మాతే. అయన కొడుకు కూడా నిర్మాతే. ఈ సమస్యల్ని ముందుండి పరిస్కరిస్తామంటే మేమంతా ఆయనతో పాటు ఉంటాం’ అని అన్నారు. మరి దీనిపై మోహన్ బాబు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)