amp pages | Sakshi

కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న 'ఊ అంటావా' సింగర్‌ ఇంద్రావతి

Published on Sun, 12/11/2022 - 08:34

తమిళసినిమా: దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన పాట ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ. పుష్ప చిత్రంలో సమంత డాన్స్‌ చేసిన ఈ పాటను గాయని ఇంద్రావతి చౌహాన్‌ పాడారు. ఈ ఒక్క పాటతోనే ఆమె బహుళ ప్రాచుర్యం పొందారు. ఇంద్రావతి ఎవరో కాదు గాయని మంగ్లీ సోదరి. వీరిది అనంతపురం జిల్లాకు చెందిన బంజారా జాతికి చెందిన కుటుంబం కావడం గమనార్హం. చాలా మధ్యతరగతి కుటుంబానికి చెందిన మంగ్లీ జానపద గీతాలతో ఎదిగి సినీగాయనిగా పాపులర్‌ అయ్యారు. 

తాజాగా పుష్ప చిత్రంతో ఆమె సోదరి ఇంద్రావతి చౌహాన్‌ గాయనిగా తెరంగేట్రం చేశారు. ఈమె ఇప్పుడు పరిచయం కావడం విశేషం. తమిళంలో ఎంజాయ్‌ అనే చిత్రంలో చెంగు చక్కర కన్ను అనే పాటను ఇంద్రావతి చౌహాన్‌ పాడారు. పెరువళ్‌ కాశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎల్‌ఎన్‌హెచ్‌ క్రియేషన్స్‌ పతాకంపై కె.లక్ష్మీనారాయణన్‌ నిర్మిస్తున్న చిత్రం ఇది. గీత రచయిత వివేకా రాసిన ఈ పాటకు కేఎం.రయన్‌ సంగీతాన్ని అందించారు.

ఈ పాట ఇటీవల విడుదల చేయగా సంగీత ప్రియుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని చిత్ర వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎంజాయ్‌ చిత్రంతో తమిళ చిత్ర సినిమాలోకి చెంగు చక్కర కన్ను పాటతో పరిచయం కావడం సంతోషంగా ఉందని, ఇక్కడ మరిన్ని అవకాశాలు వస్తున్నాయని గాయని ఇంద్రావతి చౌహాన్‌ పేర్కొన్నారు. కాగా ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌