amp pages | Sakshi

Dimple Kapadia: భర్తతో విడిపోయినా విడాకులివ్వలేదు, ఎందుకంటే..

Published on Tue, 06/08/2021 - 14:10

Happy Birthday Dimple kapadia: డింపుల్ కపాడియా… ఒకప్పుడు తన అందచందాలతో కుర్రకారులకు నిద్రలేకుండా చేసిన బ్యూటీ. అప్పటి డింపుల్ అందాలను తలచుకొని ఈ నాటికీ పరవశించిపోయేవారెందరో ఉన్నారు. బాలీవుడ్ షో మ్యాన్ రాజ్ కపూర్ దర్శకత్వంలో  రిషీ కపూర్‌‌ను హీరోగా తెరకెక్కించిన ‘బాబీ’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయిన డింపుల్‌.. తొలి మూవీతోనే హిట్‌ కొట్టి ఓవర్ నైట్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయింది. అంతేగా కాదు ఉత్తమనటిగా ‘ఫిలిమ్ ఫేర్’ అవార్డును ఎగరేసుకు పోయింది. అప్పటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే.  ఆతర్వాత ‘రుడాలి’లో తన నటవిశ్వరూపం చూపించి, జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగానూ డింపుల్ నిలచింది.

ఇదిలా ఉంటే ‘బాబీ’ సినిమా విడుదల కాకముందే, డింపుల్ గురించి బాలీవుడ్‌లో చర్చలు మొదలయ్యాయి. ఆమె అందం, నటన గురించి బాలీవుడ్‌ పెద్దలంతా చర్చించుకున్నారు. ఆ విషయం ఆ నోటా, ఈ నోటా ఆ నాటి సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నాను చేరింది. అతను తొలి చూపులోనే డింపుల్‌తో ప్రేమలో పడిపోయాడు. ఇక సూపర్‌ స్టార్‌ రాజేశ్‌ను చూశాక, డింపుల్‌ కూడా ఇష్టపడింది. దీంతో తనకంటే వయసులో 15 ఏళ్ళు పెద్దవాడయినా, రాజేశ్ ఖన్నాను వివాహమాడటానికి అంగీకరించింది డింపుల్. ‘బాబీ’ రిలీజ్ కు కొన్ని నెలల ముందే(1973) రాజేశ్, డింపుల్ పెళ్ళాడారు.

పెళ్ళయ్యాక డింపుల్ సినిమాలకు దూరంగా ఉంది. ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా పుట్టిన తరువాత కూడా రాజేశ్, డింపుల్ మధ్య అన్యోన్యబంధమే ఉందని చెప్పవచ్చు. కారణం ఏంటో తెలియదు కానీ ఆ తర్వాత రాజేశ్, డింపుల్ మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. దాంతో పరస్పర అంగీకారంతోనే విడిపోయారు.

రాజేశ్ ఖన్నా, డింపుల్ కపాడియా విభేదించి విడిపోయినా, ఏ నాడూ ఒకరి ఇష్టాలకు మరొకరు అడ్డుగా నిలువలేదు. పిల్లల కోసం ఈ దంపతులు విడాకులు కూడా తీసుకోలేదు. పార్టీల్లో కలుసుకున్నప్పుడు ఫ్రెండ్స్ లా మాట్లాడుకొనేవారు. రాజేశ్ ఖన్నా ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేయగా, ఆయన తరపున ప్రచారం కూడా చేసింది డింపుల్. ఈ ఎన్నికలో రాజేశ్ ఖన్నా విజయం సాధించారు. 

అందుకే విడాకులు ఇవ్వలేదు
రాజేశ్‌ ఖన్నాతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న డింపుల్‌కూ సన్నీ డియోల్‌ మంచి సోల్‌మేట్‌ అయ్యాడు. కష్టకాలంలోఆమెకు అండగా నిలబడ్డాడు.వారిద్దరి ప్రేమకథ చిత్రసీమలో భలేగా చక్కర్లు కొట్టింది. వారి లవ్ ఎఫైర్ ను క్యాష్ చేసుకొనేందుకు నిర్మాతలు, దర్శకులు కూడా సన్నీ, డింపుల్ జోడీని ఎంచుకొనేవారు. అయితే వీరిద్దరు ప్రేమ గురించి తెలిసి సన్నీ భార్య పూజ అప్పట్లో గొడవ కూడా చేసింది. దీంతో ఆమెకు విడాకులు ఇవ్వాల్సిందిగా సన్నీని కోరిందట డింపుల్‌. కానీ సన్నీ మాత్రం భార్యకు విడాకులు ఇచ్చేందుకు ఇష్టపడలేదట. సన్నీ నిర్ణయంపట్ల కలత చెందిన డింపుల్‌... రాజేశ్‌కి విడాకులు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకుందట. సన్నీతో సన్నిహితంగా ఉన్నప్పటికీ.. చివరి దాకా భార్యగా రాజేశ్ కు సపర్యలు చేసింది డింపుల్‌. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)