amp pages | Sakshi

భీమ్లా నాయక్‌ ట్రైలర్‌పై వర్మ షాకింగ్‌ కామెంట్స్‌, పవన్‌పై వరస సటైరికల్‌ ట్వీట్స్‌

Published on Tue, 02/22/2022 - 12:29

RGV Comments On Bheemla Nayak Trailer: రామ్‌ గోపాల వర్మ.. వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తనదైన సైటిరికల్‌ కామెంట్స్‌తో నిత్యం సినీ, రాజకీయ సెలబ్రెటీలను కవ్విస్తుంటాడు వర్మ. అందుకే ఆయన పెట్టే ప్రతి పోస్ట్‌, ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. ఈ క్రమంలో ఈ మధ్య వర్మ పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ టార్గెట్‌ చేసిన సంగతి తెలిసిందే. పవన్‌ భీమ్లా నాయక్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించినప్పటి నుంచి ఆర్జీవీ ఆయనపై కౌంటర్‌గా వరస ట్వీట్స్‌ చేస్తూనే ఉన్నాడు. 

చదవండి: ఘనంగా అనిల్‌ అంబానీ కుమారుడి వివాహం, బచ్చన్‌ ఫ్యామిలీ సందడి

ఈ క్రమంలో పవన్‌ ఫ్యాన్స్‌ అతడిపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న(ఫిబ్రవరి 21) విడుదలైన భీమ్లా నాయక్‌ ట్రైలర్‌ వర్మ వ్యంగ్యంగా స్పందించాడు. ఈ మేరకు భీమ్లా నాయక్‌ ట్రైలర్‌పై వర్మ కామెంట్‌ చేస్తూ.. ‘నిజాయితిగా చెప్పాలంటే ట్రైలర్‌ చూసిన తర్వాత భీమ్లా నాయక్‌కు బదులుగా డేనియల్‌ శేఖర్‌ అని పిలవాలని ఉందన అన్నాడు. ‘ఎందుకంటే బాహుబలి తర్వాత రానాకు ఉత్తరాదినా(బాలీవుడ్‌) పవన్‌ కంటే ఎక్కువ ప్రజాదరణ ఉంది. చదవండి: దర్శకుడిగా మారిన ఎడిటర్​.. తుపాకీతో నిఖిల్​ యాక్షన్​

బాహుబలి తర్వాత రానాకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో రానా విలన్‌గా కంటే కూడా హీరోగా మారే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది’ అంటూ రాసుకొచ్చాడు. అంతేగాక ‘భీమ్లా నాయక్‌ ట్రైలర్‌ చూస్తుంటే మూవీ యూనిట్‌ రానా పాపులారిటీ పెంచడానికే పవన్‌ కళ్యాణ్‌ను తగ్గించినట్లు కనిపిస్తోంది. పవన్‌ అభిమానిగా నేను చాలా హర్ట్‌ అయ్యాను’ అంటూ మరో ట్వీట్‌లో షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ట్రైలర్‌పై వర్మ చేసిన కామెంట్స్‌ చూసిన పవన్‌ ఫ్యాన్స్‌ ఆయనపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆర్జీవీకి తమదైన శైలిలో కౌంటర్‌ ఇస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

Videos

నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ

టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా

ఆవిడ ఉత్తరం రాస్తే అధికారులను మార్చేస్తారా..!

ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య

వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?