amp pages | Sakshi

నా కల నెరవేరింది: రామ్‌ గోపాల్‌ వర్మ

Published on Wed, 07/13/2022 - 08:18

తన కల నెరవేరిందంటున్నాడు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఈయన. ఇటీవల ఈయన చిత్రాలకు తీసుకుంటున్న నేపథ్యం కూడా వివాదాంశం గానే మారుతుంది. తరచూ బయోపిక్‌లపై దృష్టి పెడుతున్న రాంగోపాల్‌ వర్మ తాజాగా మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో పూర్తి కమర్షియల్‌ ఫార్ములాలో లడ్కీ అనే చిత్రాన్ని హిందీలో రూపొందించారు. ఆర్ట్సీ మీడియా ప్రొడక్షన్స్, ఇండో చైనీస్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రంలో నటి పూజా భలేకర్‌ ప్రధాన పాత్రలో నటించారు. కాగా పాన్‌ ఇండియా చిత్రంగా విడుదల చేస్తున్న ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు పొన్ను అనే పేరును నిర్ణయించారు.

త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్‌ సోమవారం చెన్నైలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న రాంగోపాల్‌ వర్మ మాట్లాడుతూ తాను కళాశాలలో చదువుతున్న సమయంలోనే నటుడు బ్రూస్లీ తన హృదయాన్ని టచ్‌ చేశారన్నారు. ఆయన నటించిన చిత్రాలను తాను వరుసగా చూసేవాడినని తెలిపారు. ఆ తరహా మార్షల్‌ ఆర్ట్స్‌ కథా చిత్రాలు మన దేశంలో తెరకెక్కించలేదన్నారు.

దీంతో తాను మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో చిత్రం చేయాలని చాలా కాలంగా అనుకున్నానని, ఇప్పటికీ నెరవేరిందన్నారు. బ్రూస్‌లీ తరహా పాత్రను లేడీతో చేయాలనుకున్నట్లు చెప్పారు. చాలామంది నటీమణులను పరిశీలించి చివరకు పూజా భలేకర్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆమె నిజ జీవితంలో మార్షల్‌ ఆర్ట్స్‌ క్రీడాకారిణి అని తెలిపారు. ఈ చిత్రంలో ఆమె నటనను చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)