amp pages | Sakshi

నేను నా బరువు కోసం కాదు, ఆరోగ్యం కోసం ఆలోచిస్తా: నిర్మాత

Published on Sat, 06/10/2023 - 14:06

కొందరు ఎంత తిన్నా కరెంట్‌ వైర్‌లా సన్నగా ఉంటారు. మరికొందరు ఏమీ తినకపోయినా బెలూన్‌లా ఉబ్బిపోయి బొద్దుగా కనిపిస్తారు. అధిక బరువును దారిలో పెట్టడం కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎంత డైట్‌ చేసినా, కఠోర వ్యాయామాలు చేసినా కొందరికి బరువు తగ్గడం అనేది అందని ద్రాక్షలాగే అనిపిస్తుంది. తమిళ నిర్మాత రవీందర్‌ చంద్రశేఖర్ ఈ కోవలోకే వస్తాడు.

ఈయన ఎప్పటినుంచో అధిక బరువుతో బాధపడుతున్నాడు. అయితే ఎప్పుడైతే బుల్లితెర నటి మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడో అప్పటి నుంచే తరచూ విమర్శలను ఎదుర్కొంటున్నాడు. కట్టుకున్న భార్య సన్నజాజిలా ఉంది, కానీ తనేమో భారీకాయుడు.. ఇంకేముంది, జనాలు ఆడిపోసుకున్నారు. డబ్బుల కోసమే ఆమె ఇతడిని పెళ్లి చేసుకుంది అంటూ రకరకాల విమర్శలు గుప్పించారు. వీళ్ల వైవాహిక బంధం ఎంతోకాలం నిలవదని శాపనార్థాలు కూడా పెట్టారు. ఆ రూమర్లు వచ్చినప్పుడల్లా భార్యాభర్తలిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు వదిలి తమది అన్యోన్య దాంపత్యమని చాటిచెప్తూనే వస్తున్నారు.

తాజాగా రవీందర్‌ ఓ ఇంటర్వ్యూలో తన అధిక బరువుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నేను నా బరువుపై దృష్టి పెట్టను. అందుకు బదులుగా ఆరోగ్యం, శ్రేయస్సుపైనే ఫోకస్‌ చేస్తాను. ఈరోజు ఇది తినకూడదు వంటి నియమనిబంధనలు పెట్టుకోను. ఎందుకంటే నేను డైట్‌ పాటించి చూశాను, కానీ అది వర్కవుట్‌ కాలేదు. అయినా నేను నా బరువును మోయడం అంత ఈజీయేం కాదు. నేను దాదాపు 200 కిలోల బరువుంటాను' అని చెప్పుకొచ్చాడు.

కాగా రవీందర్‌ గతంలో ఓ చికిత్స తీసుకున్నప్పుడు శరీరంలో కొవ్వు కరిగించే కణాలు క్షీణించిపోయాయి. ఇది అతడు బరువు పెరగడానికి కారణమైంది. అందుకే తాను శరీరానికి కాకుండా ఆరోగ్యానికి ప్రాముఖ్యతనిస్తున్నానని, ఊబకాయం తగ్గించడం తన చేతిలో లేదన్నాడు.

చదవండి: బతుకు బండి భారమై డ్రైవర్‌గా మారిన ఒకప్పటి హీరో?

Videos

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు

చిరు పై పోసాని సంచలన కామెంట్స్

కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి

నర్రెడ్డి నాటకాలు చాలు

సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్

Photos

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)