amp pages | Sakshi

'డంకీ' ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ ఇంత తక్కువా..? సలార్‌కు లైన్‌ క్లియర్‌

Published on Fri, 12/22/2023 - 10:00

బాలీవుడ్​ బాద్​షా షారుక్ ఖాన్.. పఠాన్‌, జవాన్ సినిమాలతో ఈ ఏడాది  రెండు భారీ బ్లాక్​ బస్టర్లను  అందుకున్నాడు. తాజాగా డిసెంబర్‌ 21న​ 'డంకీ'తో వచ్చేశాడు. రాజ్​కుమార్​ హిరానీ​ డైరెక్షన్‌లో వచ్చిన ఈ​ మూవీ పట్ల పాజిటివ్‌  టాక్‌ ఉన్నా.. ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే అలరిస్తుందని టాక్‌ వినిపిస్తుంది. భారీ అంచనాలతో విడుదలైన డంకీ చిత్రం మొదటిరోజు ఆశించిన కలెక్షన్స్‌ రాబట్టలేకపోయింది. ఈ ఏడాదిలో వచ్చిన పఠాన్‌, జవాన్‌ చిత్రాల మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్‌ను డంకీ దాటలేకపోయింది.

సినిమా ట్రేడ్ వర్గాల ప్రకారం డంకీ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ వసులు చేసింది. నెట్‌ కలెక్షన్స్‌ ప్రకారం అయితే రూ. 30 కోట్లు అని చెప్పవచ్చు. అయితే ఈ ఏడాదిలో వచ్చిన పఠాన్‌ మొదటిరోజు రూ. 106 కోట్లు కలెక్ట్‌ చేయగా జవాన్‌ రూ. 129 కోట్లు రాబట్టింది. రెండు వరుస భారీ హిట్లు కొట్టిన తర్వాత వచ్చిన చిత్రం డంకీ... దీంతో ఈ సినిమా రూ. 130 కోట్ల మార్క్‌ను దాటుతుందని అందరూ అంచనా వేశారు. డంకీ చిత్రం మేకర్స్‌ అధికారికంగా కలెక్షన్స్‌ వివరాలు ప్రకటించలేదు.

ప్రభాస్‌ ప్లాప్‌ సినిమాను దాటలేకపోయిన 'డంకీ'
ప్రభాస్‌ ప్లాప్‌ సినిమా అయిన  ఆదిపురుష్ చిత్రం కంటే డంకీ మూవీకి కలెక్షన్స్‌ తక్కువ వచ్చాయి. ఆదిపురుష్ సినిమా మొదటి రోజు 140 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నెట్‌ కలెక్షన్స్‌ ప్రకారం అయితే రూ. 37 కోట్లు. బాలీవుడ్‌లో  మొదటిరోజు వచ్చిన టాప్‌ కలెక్షన్స్‌ లిస్ట్‌లో డంకీ చిత్రం 7వ స్థానంలో ఉంది. ఈ లెక్కన చూస్తే ప్రభాస్ సలార్‌తో భారీ రికార్డ్స్‌ కొట్టడం ఖాయం అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు డంకీ మూవీకి చెప్పుకోతగిన టాక్‌ రాలేదు.

రాజ్ కుమార్ హిరానీ కేరీర్లోనే వీకెస్ట్ సినిమాగా డంకి పేరు తెచ్చుకుంది. అసలే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా వెనుకబడింది. సలార్‌ మాత్రం 33 లక్షల టికెట్లు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ద్వారా అమ్ముడపోయాయని సమాచారం. సలార్‌తో ప్రభాస్‌ బిగ్గెస్ట్‌ ఓపెనర్‌గా రికార్డ్‌ క్రియేట్‌ చేయడం ఖాయం.

Videos

సీఎం జగన్ మాస్ స్పీచ్ దద్దరిల్లిన కళ్యాణ దుర్గం

జనాన్ని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనైనా సీఎం జగన్

కళ్యాణదుర్గం బహిరంగ సభలో సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ముఖ్యాంశాలు

ఆ గ్యాంగ్ ను ఏకిపారేసిన వల్లభనేని వంశీ

Watch Live: కళ్యాణదుర్గంలో సీఎం జగన్ ప్రచార సభ

పొరపాటున బాబుకు ఓటేస్తే..జరిగేది ఇదే..

చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చారు

ముస్లిం రిజర్వేషన్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)