amp pages | Sakshi

శిల్పాశెట్టి అందానికే వన్నె తెచ్చిన చీర ధర ఎంతంటే?

Published on Sun, 02/20/2022 - 08:33

తెలుగు ప్రేక్షకుల సాగరకన్య.. శిల్పాశెట్టి.. నటన కంటే ఆమె ఫిట్‌నెస్‌కే అభిమానులు ఎక్కువ. ఆ ఫిట్‌నెస్‌కు ఫిట్‌ అయ్యే ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ కొన్ని ..

ప్రింట్స్‌ బై రాధిక... 
అందమైన చిత్రకళ కొంతమందికి ఆనందాన్నిస్తే.. జైపూర్‌కు చెందిన రాధిక రావత్‌కు మాత్రం స్ఫూర్తిని ఇచ్చింది. ఆ ఆర్ట్‌ను ఆధారంగా చేసుకొని అందమైన దుస్తులను డిజైన్‌ చేయాలనుకుంది. ఆ ఆసక్తితోనే ఎన్‌ఐఎఫ్‌టీలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేసింది. లండన్‌ వెళ్లి స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌లో చిత్రకళపై శిక్షణ తీసుకుంది. స్వదేశానికి తిరిగొచ్చి  2017లో సొంతంగా ‘ప్రింట్స్‌ బై రాధిక’ అనే ఓ ఫ్యాషన్‌ హౌస్‌ను ప్రారంభించింది. ఈ హౌస్‌లో లభించే దుస్తులన్నిటిపై ఉండే డిజైన్‌ను.. సొంతంగా రాధికే ముద్రిస్తుంది. అదే వీరి బ్రాండ్‌ వాల్యూ. ప్రత్యేకమైన వేడుకలకు సరిపోయే డిజైన్స్‌ను రూపొందించడంలోనూ రాధిక సిద్ధహస్తురాలు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్‌లైన్‌ స్టోర్స్‌లలో ప్రింట్స్‌ బై రాధిక డిజైన్స్‌ లభిస్తాయి. 

మొజాటీ  జ్యూయెలరీ 
సలోమీ షా బజాజ్‌.. శాస్త్రీయ నృత్యకళాకారిణి. వృత్తి రీత్యా సంప్రదాయ ఆభరణాల అవసరం తనకు చాలా ఎక్కువ. అయితే, తన నాట్యానికి సంబంధించిన ఆహార్యాన్ని తానే తయారుచేసుకోవాలనుకుంది. ఆ ఆలోచనే ఆమెను జ్యూయెలరీ డిజైనర్‌గా మార్చింది. తండ్రిది వజ్రాల వ్యాపారం కావడంతో తన పని మరింత సులువు అయింది. జెమాలజీ కోర్సు చేసి, ‘మొజాటీ’ పేరుతో జ్యూయెలరీ షాప్‌ను తెరిచింది. 18 క్యారెట్ల నాణ్యతతో అందమైన బంగారు ఆభరణాలు ఇక్కడ లభిస్తాయి. అయితే, ధర మాత్రం డిజైన్‌ను బట్టే ఉంటుంది. ఆన్‌లైన్‌లో కూడా మొజాటీ జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు.

చీర బ్రాండ్‌: ప్రింట్స్‌ బై రాధిక 
ధర:రూ. 30,000

జ్యూయెలరీ బ్రాండ్‌: మొజాటీ
ధర: రూ. 4,350

అందంగా కనిపించాలంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి. అందుకే, ఫ్యాషన్‌ కంటే ముందు నేను ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తా: శిల్పా శెట్టి

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)