amp pages | Sakshi

మైనస్‌ 1 డిగ్రీ చలిలో.. షర్ట్‌ తీసేసి పరుగులు పెడుతున్న హీరో.. వీడియో వైరల్‌

Published on Tue, 12/14/2021 - 18:51

గతంలో సినిమా హీరోలు నటన, డాన్స్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు. ట్రెండ్‌ మారుతుండడంతో కాలానుగుణంగా హీరోలలోనూ మార్పులు వచ్చాయి. ప్రస్తుతం హీరోలు తమ శరీరాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అందుకే ఒకప్పుడు సిక్స్‌ ప్యాక్‌ హీరోల జాబితాలో ఒకరో ఇద్దరో ఉంటే ప్రస్తుతం చాలా మంది ఆ జాబితాలో చేరిపోయారు. ఇక ప్రత్యేకంగా బాలీవుడ్‌లో.. టైగ‌ర్ ష్రాఫ్ తన బాడీ ఫిట్‌గా ఉంచడంలో ఏ మాత్రం రాజీ పడడన్న విషయం తెలిసిందే.

అలా శ్రద్ధ తీసుకుంటున్నాడు కాబట్టే బీ టౌన్‌లో రకరకాల స్టంట్స్‌ చేస్తూ యాక్షన్‌ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. తాజాగా టైగర్‌ ‘గ‌ణ్‌ప‌త్’ సినిమా షూటింగ్ యూర‌ప్‌లో జరుగుతోంది. యూరప్‌ లాంటి దేశాలలో ప్రస్తుతం గడ్డకట్టే చలి వాతావరణం ఉంటుందన్న సంగతి తెలిసిందే. టైగర్‌ ష్రాఫ్‌ అంత‌టి చ‌లి వాతావరణంలో కూడా ఉద‌యాన్నే లేచి ష‌ర్టు లేకుండా కేవ‌లం షార్ట్స్ ధ‌రించి అలా జాగింగ్‌ చేశాడు. ఆ వీడియోని తన ఇన్‌స్టా అకౌంట్‌లో షేర​ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

ఈ వీడియో చూసిన వాళ్లు షాకింగ్‌ కామెంట్లు పెడుతున్నారు. అందులో దిషా పటానీ.. ‘లోల్‌’, రకుల్‌.. ‘వావ్‌! అంత చలిలో ఎలా?’ అంటూ స్పందించారు. ‘గ‌ణ్‌ప‌త్’ చిత్రంలో టైగర్‌ స‌ర‌స‌న కృతి స‌న‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ రూపొందుతున్న ఈ చిత్రం జాకీ భ‌గ్నానీ నిర్మిస్తున్నారు. ఇది వరకే వీరిద్దరు హీరోపంతీ అనే సినిమాలో కలిసి నటించారు. 

చదవండి: Vicky Kaushal-Katrina Kaif: భార్యభర్తలుగా తొలిసారి మీడియా ముందుకొచ్చిన కత్రినా, విక్కీ కౌశల్‌

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌