amp pages | Sakshi

శివుడిపై అద్భుతమైన పాట వైరల్‌.. డాక్టర్‌ నాగ మాధురి గాత్రానికి ఫిదా!

Published on Sat, 03/09/2024 - 17:52

'సర్వేంద్రియానాం నయనం ప్రధానం' అన్న విషయం తెలిసిందే. అందుకు తగినట్లుగా డా: నాగ మాధురి ఏరికోరి నేత్ర వైద్యురాలుగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. డాక్టర్‌గా సేవలు అందిస్తూనే ఆమెలో మరో టాలెంట్‌ కూడా దాగి ఉంది. అందరినీ మెచ్చేలా పాటలు పాడగలదు. ఒకపైపు వేలాదిమందికి కంటి చూపు ప్రసాదిస్తూ... సరి చేస్తూనే... సంగీతంలోనూ నిష్ణాతురాలిగా రాణిస్తున్నారు.  బహుముఖ ప్రతిభాశాలిగా డాక్టర్‌ నాగ మాధురి మెప్పిస్తున్నారు.

ఉన్నత విద్యా సంపన్న కుటుంబంలో జన్మించిన నాగ మాధురి చిన్నప్పటి నుంచి సంగీతం పట్ల మక్కువ చూపేవారు. చదువులో చాలా చురుగ్గా ఉంటూనే.. చిత్ర కళ, గానంలో విశేష ప్రతిభ కనబరిచేవారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో డాక్టర్ వైజర్సు సుబ్రహ్మణ్యం దగ్గర సంగీతంలో శిష్యరికం చేశారు. కర్నాటిక్ క్లాసిక్ మ్యూజిక్‌లో డిప్లొమా చేయడంతోపాటు అందులో డిష్టింక్షన్ సాధించడం నాగ మాధురి ప్రతిభను చెప్పకనే చెబుతుంది. ఆప్తమాలజీ (కంటి వైద్యం) స్పెషలిస్ట్‌గా ఒంగోలులోని స్మార్ట్ విజన్ హాస్పిటల్‌కి మేనేజింగ్ పార్టనర్ కమ్ ఛీఫ్ కన్సల్టెంట్‌గా సేవలందిస్తూనే.. సంగీతంలోనూ సాధన చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.

ఈ శివరాత్రికి కానుకగా ఆ మహా శివుడిపై ప్రేమతో అద్భుతమైన పాటను ఆమె పాడారు. దక్షిణ భారత సినీ సంగీత రంగంలో పేరుగాంచిన స్ట్రింగ్ ప్లేయర్ మాండలిన్ ఎస్.ఎమ్. సుభాని సారధ్యంలో "శంభో మహాదేవ... శంకర గిరిజా రమణ" త్యాగరాజ కృతిని ఆలపించి.. 'గాన మాధురి' అనే తన పేరును సార్ధకం చేసుకున్నారు నాగ మాధురి. 15 సంగీత వాయిద్యాలలో నిష్ణాతులు  అయిన సుభాని గారు కీరవాణి, థమన్, రెహమాన్, అనిరుద్ వంటి దిగ్గజ దర్శకులకు తన వాద్య సహకారం అందిస్తుంటారు. 

ఇకపోతే... "శంభో మహాదేవ" ఆడియో అండ్ వీడియో ఆల్బమ్‌ను మ్యూజిక్ మాంత్రికుడు మణిశర్మ ఆవిష్కరించి, అభినందించడం విశేషం. "శంభో మహదేవ" ఆల్బమ్ అనే తన కల సాకారం దాల్చడంలో మాండలిన్ సుభాని గారి స్ఫూర్తి, విశ్వనాధ్ అరిగెల సహకారం, మరీ ముఖ్యంగా తన ఫ్యామిలి సపోర్ట్ ఎంతైనా ఉందని  డాక్టర్ నాగ మాధురి అన్నారు. మణిశర్మ గారి మంచితనాన్ని, ఆయన అభినందనను ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె తెలిపారు.

Videos

బాహుబలి పట్టాభిషేకం సీన్ తలపించిన సీఎం జగన్ సభ

చంద్రబాబు పై గాడిద సామెత

"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

రైతులను ఉద్దేశించి సీఎం జగన్ అద్భుత ప్రసంగం

సీఎం జగన్ మాస్ స్పీచ్ దద్దరిల్లిన కళ్యాణ దుర్గం

జనాన్ని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనైనా సీఎం జగన్

కళ్యాణదుర్గం బహిరంగ సభలో సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ముఖ్యాంశాలు

ఆ గ్యాంగ్ ను ఏకిపారేసిన వల్లభనేని వంశీ

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)