amp pages | Sakshi

నేను అలాంటి సినిమాలు చేయను: సుధీర్‌ బాబు

Published on Fri, 01/27/2023 - 21:20

సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం 'హంట్'. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. మహేష్‌ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ఆడియన్స్  నుంచి హిట్ టాక్ లభించింది. తాజాగా చిత్రబృందం సంస్థ కార్యాలయంలో సక్సెస్ మీట్ నిర్వహించారు.  

సుధీర్ బాబు మాట్లాడుతూ..'సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.  ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని భయపడ్డాం. ప్రేక్షకులు అందరూ సెకండాఫ్‌లో 30 నిమిషాలు ఎక్సలెంట్ అని చెబుతున్నారు. సోషల్ మీడియాలో చాలా మంది సినిమాను సూపర్బ్ అంటూ పోస్టులు చేశారు. ఆడియన్స్ చాలా థాంక్స్. నేను అయితే రెగ్యులర్ సినిమాలు చేయను. ఇప్పటి వరకు చేసినవి అన్నీ డిఫరెంట్ సినిమాలే. ఈ సినిమా కూడా చాలా డిఫరెంట్ సినిమా.' అని అన్నారు.  

దర్శకుడు మహేష్ మాట్లాడుతూ..'క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. హీరో సుధీర్ బాబు గారు ధైర్యంగా ఆ రోల్ చేశారు. నేను ఎప్పటికీ గర్వపడే సినిమా. తెలుగులో ఇటువంటి సినిమా చేయడం తొలిసారి. భరత్ మా సినిమాలో నటించినందుకు థాంక్స్. సుధీర్ బాబుకు హ్యాట్సాఫ్. ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వాలనే తపన ఆయనదే.' అని అన్నారు.

భరత్ మాట్లాడుతూ..'తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి కొన్నేళ్లు టైమ్  తీసుకున్నా. మంచి సినిమా చేశా. కంటెంట్ సినిమాల కోసం చూసే ప్రేక్షకులకు సరైన చిత్రమిది. కమర్షియల్ వ్యాల్యూస్‌తో తీశాం. మహేష్ కెరీర్‌లో ఇదొక మంచి సినిమా. సుధీర్ బాబు కొత్తగా ట్రై చేశారు. ఈ సినిమాలో నేను ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉంది.' అని అన్నారు. 

సినిమాటోగ్రాఫర్ అరుల్ విన్సెంట్ మాట్లాడుతూ..'సినిమాకు లభిస్తున్న స్పందనతో సంతోషంగా ఉన్నాం. కొత్తగా చేయడం నాకు చాలా ఇష్టం. 'పలాస' తర్వాత తెలుగులో నేను చేసిన చిత్రమిది. సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్ ముగ్గురు హీరోలు అద్భుతంగా నటించారు. సినిమాలో హీరోయిన్ లేదనే ఫీలింగ్ ఎవరికీ ఉండదు. రెస్పాన్స్ బాగుంది.' అని అన్నారు.


 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌