amp pages | Sakshi

స‌న్నీలియోన్‌కు 20 ఏళ్ల కొడుకు? ఫ‌న్నీ రిప్లై!

Published on Sat, 12/12/2020 - 15:57

బాలీవుడ్ తార‌లు ఇమ్రాన్ హ‌ష్మీ, స‌న్నీ లియోన్ ఇద్ద‌రూ కేవ‌లం ఓ పాట‌లో మాత్ర‌మే క‌లిసి న‌టించారు. కానీ వీళ్ల‌కు పెళ్లైంద‌ని, బిహార్‌కు మ‌కాం మార్చార‌ని, ఈ జోడీకి డిగ్రీ చ‌దివే కొడుకున్నాడంటూ ఈ మ‌ధ్య ఓవార్త తెగ‌ హ‌ల్‌చ‌ల్ అవుతోంది. ఇది కాస్తా స‌న్నీలియోన్ కంట‌ప‌డ‌గా ఆమె తేలిక‌గా న‌వ్వేశారు. ఆ విద్యార్థి చేసిన‌ తుంట‌రి ప‌నికి ఏమీ అన‌లేక మెచ్చుకోలుగా చ‌మ‌త్క‌రించారు. అస‌లేం జ‌రిగిందంటే.. బిహార్‌లోని ముజ‌ఫ‌ర్‌పూర్‌కు చెందిన 20 ఏళ్ల కుంద‌న్ కుమార్.. ధనరాజ్‌ మహ్తో డిగ్రీ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అత‌డు త‌ప్పుడు వివ‌రాల‌తో హాల్ టికెట్‌కు ద‌ర‌ఖాస్తు చేశాడు. త‌ల్లి పేరు రాయాల్సిన కాల‌మ్‌లో స‌న్నీలియోన్ అని, తండ్రి అని ఉన్న ద‌గ్గ‌ర ఇమ్రాన్ హ‌ష్మీ అన్న పేర్ల‌ను రాశాడు. (చ‌ద‌వండి: రాజకీయాల్లో రాణించాలి: చిరంజీవి)

త‌ల్లిదండ్రుల పేర్లు బాలీవుడ్ సెల‌బ్రిటీల‌ను సూచిస్తుండ‌టంతో ఆ ఎక్జామ్ అప్లికేష‌న్ ఫామ్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. తుంట‌రి ప‌ని చేసిన స‌ద‌రు విద్యార్థిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వ‌ర్సిటీ అధికారులు పేర్కొన్నారు. అయితే బాలీవుడ్ భామ స‌న్నీలియోన్ మాత్రం ఆ విద్యార్థి చేసిన ప‌నికి స‌ర‌దాగా న‌వ్వుకున్నారు. అత‌డిని అద్భుతం అంటూ మెచ్చుకున్నారు. అత‌డు ఇలాగే ఎప్పుడూ పెద్ద పెద్ద క‌ల‌లు కంటూ ఉండాలి అని చ‌మ‌త్క‌రించారు. అయితే ఇలా స‌న్నీలియోన్ పేరు వార్త‌ల్లో నిల‌వ‌డం ఇదేమీ కొత్త‌ కాదు. గ‌తంలో బిహార్ జూనియ‌ర్ ప‌రీక్ష‌లో స‌న్నీలియోన్ టాప‌ర్‌గా నిలిచింద‌ని, దీంతో ఆమె కోల్‌క‌తాలోని కళాశాల‌కు ఎంపికైంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై కూడా ఆవిడ ఫ‌న్నీగా స్పందిస్తూ మీ అంద‌రినీ కాలేజీలో క‌లుస్తాన‌ని చెప్పుకొచ్చారు. కాగా ఆమె వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించే స్ప్లిట్స్ విల్లా త‌ర్వాతి సీజ‌న్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. (చ‌ద‌వండి: తల్లి సన్నీ లియోన్‌.. తండ్రి ఇమ్రాన్‌ హష్మి)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)