amp pages | Sakshi

అలాంటి వారి బాధే ఈ సినిమా: మారుతి

Published on Mon, 02/05/2024 - 17:00

మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి కీలక పాత్రల్లో నటిస్తున్న కోలీవుడ్ చిత్రం ‘ట్రూ లవర్’. ఈ చిత్రానికి ప్రభురామ్‌ వ్యాస్‌ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 10న తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుత రోజుల్లో ప్రేమికుల మధ్య మోడరన్ డే రిలేషన్స్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించినట్లు  తెలుస్తోంది. అయితే ఈ మూవీ టాలీవుడ్‌ హక్కులను బేబీ నిర్మాత ఎస్‌కేఎన్‌, డైరెక్టర్‌ మారుతి దక్కించుకున్నారు. వీరిద్దరు సంయుక్తంగా ట్రూ లవర్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న డైరెక్టర్ మారుతి ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

డైరెక్టర్‌ మారుతి మాట్లాడుతూ.. 'ఈ సినిమాకు ఎందుకు చూడమని చెబుతానంటే. ఒక మగాడి బాధ ఎలా ఉంటుందో చూపించాడు. అమ్మాయి చాలా ఈజీగా తీసుకుంటారు. ఇక్కడ అమ్మాయిల తప్పుకాదు. తన ప్రియురాలిని ఎవరైనా ట్రాప్ చేస్తాడేమో అని ఆమె లవర్ భయపడుతూ ఉంటాడు. అతని బాధను తెరపై చూపించే ప్రయత్నమే ఈ సినిమా. సిన్సియర్‌గా లవ్‌ చేసే వారి బాధ వర్ణనాతీతం. అలాంటి వ్యక్తి తన ప్రేమ కోసం ఏం చేస్తాడనేదే కథ. ఈ కథను డైరెక్టర్ దాదాపు ఆరేళ్లు కష్టపడి రాశాడు. బేబీ సినిమా చూసేటప్పుడు ప్రతి సీన్ అలానే రాసుకున్నారు. ఇలాంటి కంటెంట్ ఉన్న ఈ సినిమాను ఎవరు మిస్సవరనేది నా నమ్మకం.' అని అన్నారు. కాగా.. మారుతి ప్రస్తుతం రెబల్ స్టార్‌ ప్రభాస్‌తో రాజాసాబ్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

Videos

చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు

చంద్రబాబుపై విద్యార్థుల కామెంట్స్

30 వేల కోట్ల ఆరోపణలపై పెద్దిరెడ్డి క్లారిటీ..!

జగన్ ప్రచార సభలో ఊహించని రెస్పాన్స్

చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..!

పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుపుపై చిరంజీవి వీడియో..కొమ్మినేని స్ట్రాంగ్ రియాక్షన్

ఏపీ రాజధానిపై ఈనాడు తప్పుడు ప్రచారం ... కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..

అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!

చంద్రబాబుపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..

రాక్షస పరివార్..

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?