amp pages | Sakshi

‘ఆచార్య’ సెట్‌లో సందడి చేయనున్న మెగా కోడలు

Published on Thu, 03/04/2021 - 11:12

మెగా కోడలు ఉపాసన కామినేని సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. స్టార్‌ హీరోలైన మామ, భర్త సినిమా షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉంటే.. కోడలు సామాజిక స్పృహ కలిగిన సెలబ్రిటీగా నిత్యం వార్తల్లో ఉంటారు. అయినప్పటికీ భర్త రామ్‌ చరణ్‌ షూటింగ్‌లో సెట్స్‌లో కూడా అప్పుడప్పుడు దర్శనమిస్తుంది. తాజా ఆమె ‘ఆచార్య’ సెట్‌లో కూడా సందడి చేసేందుకు పయనమైంది. ఇందుకోసం గురువారం ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలుదెరి కొద్ది సేపటి క్రితమే రాజమండ్రి ఎయిర్‌పోర్టులో దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం చెర్రీ తండ్రి మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి ఆచార్య షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కతున్నఈ మూవీలో చెర్రీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.  ప్రస్తుతం ఈ మూవీ మారెడుమిల్లిలోని అటవీ ప్రాంతాల్లో షూటింగ్‌ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. అక్కడ చిరంజీవి, రామచరణ్‌లకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు నిన్న చెర్రీ షేర్‌ చేసిన ఓ స్టిల్‌ చూస్తే తెలుస్తోంది. అంతేగాక రామ్‌ చరణ్‌  దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మక తెరకెక్కి‍స్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుపుకుంటోంది. దీంతో చెర్రీ ఒకేసారి రెండు మూవీ షూటింగ్‌లలో పాల్గొంటు ఫుల్‌ బిజీ ఆయిపోయాడు.

చదవండి: ‘సాహో’ డైరెక్టర్‌తో కన్నడ స్టార్‌ హీరో సుదీప్‌ మూవీ!
     ‘ఆర్‌ఆర్‌ఆర్’‌ క్లైమాక్స్‌ షూట్‌లో హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టర్‌
        కామ్రేడ్‌గా చరణ్‌.. ఆచార్య సెట్‌లో నాన్నతో ఇలా..

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)