amp pages | Sakshi

విడాకులపై స్పందించిన 'ఉరీ' నటుడు.. త్వరలోనే అది జరగనుంది..!

Published on Tue, 12/20/2022 - 18:30

'ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్' నటుడు మోహిత్ రైనా దంపతులపై విడాకులు తీసుకుంటున్నారని వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అతని భార్య అదితి శర్మతో విడాకులపై గాసిప్స్ గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా నటుడు మోహిత్ రైనా స్పందించారు. ఆ రూమర్లను ఆయన కొట్టిపారేశారు. 'నా మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నానని వెల్లడించారు.  మోహిత్ రైనా, భార్య అదితి శర్మ విడాకుల  తీసుకుంటున్నట్లు వార్తలొచ్చిన కొన్ని గంటల్లోనే ఆయన స్పష్టం చేశారు.

ఈ ఏడాది జనవరి 1న అదితి శర్మతో తన పెళ్లిని ప్రకటించి మోహిత్ తన అభిమానులను ఆశ్చర్యానికి గురి అయ్యేలా చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో తన మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు ఓ మీడియాకు వివరించారు. అయితే గతంలో మోహిత్ తన సోషల్ మీడియాలో అదితితో తన పెళ్లి ఫోటోలన్నింటినీ తొలగించిన తర్వాత రూమర్లు వచ్చాయి. అంతే కాకుండా మోహిత్, అదితి కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో కావడం విడాకులకు మరింత బలాన్ని చేకూర్చింది.

మోహిత్ రైనా - అదితి శర్మల ప్రేమకథ:  అదితి శర్మతో స్నేహం వల్లే మేమిద్దరం ఒక్కటైనట్లు మోహిత్ పేర్కొన్నాడు. కొన్నేళ్ల పాటు స్నేహితులుగా ఉన్న వీరిద్దరు.. కొవిడ్ (రెండో వేవ్)లో మోహిత్ పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు.  కాగా.. మోహిత్ టెలివిజన్ ధారావాహిక 'దేవోన్ కే దేవ్ మహాదేవ్'లో లార్డ్ శివగా నటించారు. అతను 'ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్', 'షిద్దత్' వంటి అనేక బాలీవుడ్ చిత్రాలతో పాటు 'కాఫిర్', 'బౌకాల్', 'ముంబయి డైరీస్ 26/11' వంటి వెబ్ సిరీస్‌లలో కూడా నటించాడు.

Videos

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌