amp pages | Sakshi

‘వలిమై’ మూవీ ట్విటర్‌ రివ్యూ

Published on Thu, 02/24/2022 - 08:07

తమిళ స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌ నటించిన తాజా చిత్రం వలిమై. గతంలో అజిత్‌కు నేర్కొండ పార్వై లాంటి సూపర్‌ హిట్‌ మూవీని అందించిన హెచ్‌.వినోద్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జి.స్టూడియోస్‌ సంస్థతో కలిసి  బే వ్యూ ప్రాజెక్ట్స్‌పై బోనీ క‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.హిందీ నటి హ్యూమా ఖురేషి నాయకిగా నటించిన ఇందులో టాలీవుడ్‌ యువ నటుడు కార్తికేయ ప్రతినాయకుడిగా నటించారు.జనవరి 13న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది.

ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో ఈ సినిమాని శుక్రవారం(ఫిబ్రవరి 24) థియేటర్స్‌లో విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా ట్రైల‌ర్‌లో చూపించిన యాక్ష‌న్ స‌న్నివేశాలు అయితే అదిరిపోయాయి.ఇప్పటికే పలు చోట్ల ప్రిమియర్‌ షోస్‌ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్‌లో చర్చిస్తున్నారు.అవేంటో చూద్దాం.

వలిమై చిత్రానికి నెటిజన్స్‌ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా అద్భుతంగా ఉంది. వలిమై కోసం అజిత్‌ వంద శాతం ఎఫర్ట్‌  పెట్టి పని చేశారని కొంతమంది కామెంట్‌ చేయగా, రొటీన్‌ స్క్రీన్‌ ప్లే, ఫ్యాన్స్‌ను మెప్పించే సీన్స్ లేవ‌ని మరికొంతమంది అంటున్నారు.

అలాగే సినిమా రన్‌ టైమ్‌ మూడు గంటలు ఉండడం కూడా ఇబ్బందిగా ఉందని కామెంట్‌ చేస్తున్నారు.ఇండియన్‌ సినిమాల్లో కొత్త హిస్టరీ. ఒక్క మాటలో చెప్పాలంటే మ్యాజిక్‌ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.

ఫస్టాఫ్ బాగుందని, సెకండాఫ్‌ యావరేజ్‌ అని అంటున్నారు.నో డౌట్ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్. అజిత్ కుమార్ చేసిన యాక్షన్ ఎలిమెంట్స్ అద్భుతమని కొం‍తమంది కామెంట్‌ చేస్తున్నారు. 

Videos

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌