amp pages | Sakshi

వరుణ్‌ సందేశ్‌ హీరోగా కొత్త చిత్రం

Published on Thu, 09/29/2022 - 19:25

హ్య‌పీ డేస్’, ‘కొత్తబంగారు లోకం’ వంటి వ‌రుస విజ‌యాల‌తో టాలీవుడ్‌లో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వ‌రుణ్ సందేశ్‌. కానీ అదే జోష్‌ను త‌రువాత సినిమాల్లో కంటిన్యూ చేయ‌లేక‌పోయాడు. వ‌రుస ఫ్లాప్‌లు వెంటాడటంతో సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చాడు. తాజాగా సరికొత్త కథలో హీరోగా తిరిగి వస్తున్నాడు  బి. యం సినిమాస్ పతాకంపై వరుణ్ సందేశ్ , సీతల్ భట్  జంటగా ఆర్ . యన్  హర్ష వర్ధన్  దర్శకత్వంతో ఓ సినిమా తెరకెక్కబోతుంది. శేషు మారం రెడ్డి ,బోయపాటి భాగ్య లక్ష్మి సమర్పణలో  ‘ప్రొడక్షన్ నెంబర్ 1 ’గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు తాజాగా హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దామోదర్ ప్రసాద్  ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, ప్రొడ్యూసర్ అశ్వినీదత్  కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో హీరో వరుణ్ సందేశ్  మాట్లాడుతూ..  ఫుల్ ఔట్ ఔట్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రం వస్తుంది.  లవ్, యాక్షన్, సెంటిమెంట్ ఉన్న ఈ సినిమా నాకు చాలా మంచి విజయం అందిస్తుంది.  నాకింత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు’అన్నారు.

‘ హర్షవర్ధన్ ఫుల్ ఔట్ అండ్‌ ఔట్ ఎంటర్ టైనర్ కథ చెప్పగానే  నాకు బాగా నచ్చి ఈ సినిమా చేద్దాం అని చెప్పాను. ఈ సినిమాకు మంచి నటీనటులు, టెక్నిషియన్స్ దొరికారు. మంచి కథతో తీస్తున్న  ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’అన్నారు చిత్ర నిర్మాత శేషు మారం రెడ్డి , బోయపాటి భాగ్య లక్ష్మి. 

‘సినిమాను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి  చెయ్యాలని ప్లాన్ చేశాం.  ఈ సినిమాలో కాశి విశ్వనాథ్ గారు మంచి  క్యారెక్టర్ చేస్తున్నారు, ఇంకా ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, శివాజీ రాజా , సునీల్ , ధన్ రాజ్ ,  , మీనా కుమారి  ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’అన్నాడు దర్శకుడు హర్షవర్ధన్.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌