amp pages | Sakshi

‘దమ్ము’ తర్వాత అందుకే సినిమాలు చేయలేదు: వేణు తొట్టెంపూడి

Published on Fri, 07/29/2022 - 08:20

‘‘రామారావు ఆన్‌ డ్యూటీ’ చిత్రంలో సీఐ మురళి పాత్ర చేశాను. ఇలాంటి జోనర్‌ సినిమా నేను చేయలేదు. పైగా వైడ్‌ రీచ్‌ ఉన్న సినిమా. ఇలాంటి సినిమా చేస్తే నేను మళ్లీ నటిస్తున్నాననే విషయం ప్రేక్షకులకు రీచ్‌ అవుతుందనే అభిప్రాయంతోనే ఈ సినిమా చేశాను’’ అని నటుడు వేణు తొట్టెంపూడి అన్నారు. రవితేజ హీరోగా దివ్యాంశా కౌశిక్, రజీషా విజయన్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. శరత్‌ మండవ దర్శకత్వంలో సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న వేణు తొట్టెంపూడి పంచుకున్న విశేషాలు.

‘దమ్ము’ చిత్రం తర్వాత నేను సినిమాలు చేయకపోవడానికి ప్రత్యేకమైన కారణాలు లేవు. మాకున్న వ్యాపారాల్లో బిజీ అయిపోవడంతో సినిమాల గురించి ఆలోచించే తీరిక లేదు. కొంతమంది సినిమా కోసం సంప్రదించినా సున్నితంగా తిరస్కరించేవాణ్ణి. అయితే కరోనా టైమ్‌లో ఇంట్లో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చూస్తున్నప్పుడు మళ్లీ సినిమాపై ఆసక్తి కలిగింది. ఆ సమయంలో శరత్‌ మండవ చెప్పిన ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ కథ నచ్చడంతో ఓకే చెప్పేశాను. 

► ‘స్వయంవరం’ సినిమాలో రవితేజగారు నాతో కలిసి పని చేయాల్సి ఉన్న విషయం గురించి నిజంగా నాకు తెలీదు. అప్పుడు కుదరకపోయినా ‘రామారావు ఆన్‌ డ్యూటీ’తో మా కాంబినేషన్‌ కుదిరింది. మొదటి నుంచి కూడా నేను మల్టీస్టారర్‌ సినిమాలకి ఆసక్తి చూపేవాణ్ణి. ‘చిరునవ్వుతో’ వంటి హిట్‌ తర్వాత ‘హనుమాన్‌ జంక్షన్‌’ సినిమా చేశాను. చాలామంది నటీనటులతో కలసి నటించడం ఓ పండగలా ఉంటుంది. 



► నేను హిట్‌ సినిమాలు చేసినప్పటికీ నా పాత్రకు డబ్బింగ్‌ చెప్పలేదనే చిన్న అసంతృప్తి ఉండేది. కానీ ‘రామారావు ఆన్‌ డ్యూటీ’లో నేనే డబ్బింగ్‌ చెప్పడం తృప్తిని ఇచ్చింది. ఇకపై నా పాత్రలకు నేనే డబ్బింగ్‌ చెబుతాను. రవితేజగారి లాంటి మాస్‌ స్టార్‌ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం హ్యాపీ. ఇలాంటి మంచి చిత్రంతో నాకు ఒక ప్లాట్‌ఫామ్‌ ఇచ్చిన రవితేజ, సుధాకర్, శరత్‌ మండవలకు థ్యాంక్స్‌. 

► నా సినిమాలకు త్రివిక్రమ్‌ రచయితగా చేశారు. తను దర్శకుడు అయ్యాక ‘అతడు’లో సోనూ సూద్‌ చేసిన పాత్ర మొదట నాకే చెప్పారు. నేను చేయకపోవడంతో సోనూ సూద్‌ చేశారు. నాకు సరిపడే పాత్ర ఉంటే త్రివిక్రమ్‌ తప్పకుండా నాకు చెబుతారు. నా ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఏం లేదు.. మంచి ఆహారం తింటాను. సాధ్యమైనంత వరకూ బయట ఫుడ్‌కు దూరంగా ఉంటాను. శరీరాన్ని పాడుచేసే ఏ చెడ్డ అలవాటు లేదు. మిగతాది తల్లితండ్రుల ఆశీర్వాదం. 

ఇకపై వరుసగా సినిమాలు చేస్తాను. అలాగే వెబ్‌ కంటెంట్‌పై కూడా దృష్టి పెట్టాను. ప్రస్తుతం  ఛాయ్‌ బిస్కెట్‌ నిర్మా ణంలో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే ఒక వెబ్‌ సిరీస్‌ కూడా చర్చల్లో ఉంది. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)