amp pages | Sakshi

ప్రముఖ నటి కన్నుమూత, రాష్ట్రపతి సంతాపం

Published on Fri, 12/02/2022 - 17:44

ప్రముఖ ఒరియా (ఒడియా) నటి ఝరానా దాస్‌(77) అనారోగ్యంతో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఒడిశాలోని కటక్‌లో తన నివాసంలో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. 'లెజెండరీ నటి ఝరానా దాస్‌ మరణవార్త కలిచివేసింది. భౌతికంగా ఆమె మన మధ్య లేకపోయినా తను ఒడియా ఫిలిం ఇండస్ట్రీకి అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి' అంటూ ట్విటర్‌ వేదికగా ద్రౌపది ముర్ము నివాళులు అర్పించారు.

కాగా ఝరానా దాస్‌ 1945లో జన్మించారు. 1960లో యాక్టింగ్‌ కెరీర్‌ను ప్రారంభించారు. శ్రీ జగన్నాథ్‌, నారి, అడినమేఘ, హిసబ్‌నిఖాస్‌, పుజఫుల, అభినేత్రి, మలజన్హ, హీరా నేళ్ల వంటి సినిమాలతో స్టార్‌డమ్‌ తెచ్చుకున్నారు. కటక్‌లో దూరదర్శన్‌ అసిస్టెంట్‌ స్టేషన్‌ డైరెక్టర్‌గానూ ఆమె పని చేశారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి హరేకృష్ణ మహతబ్‌ జీవితంపై ఓ డాక్యుమెంటరీ కూడా తీసి మన్ననలు పొందారు. ఝరానా క్లాసికల్‌ డ్యాన్సర్‌ కూడా! ఒడియా చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకుగానూ ఆమెకు జయదేవ్‌ పురస్కారం లభించింది.

చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న క్రేజీఫెలో
జూబ్లీహిల్స్‌లో ప్రభాస్‌కు 84 ఎకరాల ఫామ్‌హౌస్‌

Videos

ఇచ్చాపురం జనసంద్రం..

పార్టీ పెట్టి పదేళ్ళయింది..ఏం పీకావ్..పవన్ కి ముద్రగడ పంచ్

పేదల నోట్లో మట్టి కొట్టిన సైకో.. రైతులు, విద్యార్థులపై బాబు కుట్ర

"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?