amp pages | Sakshi

కత్రినా కైఫ్‌తో విక్కీ కౌశల్‌ రిలేషన్‌షిప్‌.. టీజ్‌ చేసిన కపిల్‌

Published on Mon, 10/11/2021 - 12:08

బాలీవుడ్‌ ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ప్రేమ చిగురించడం సాధారణంగా జరిగేదే. అయితే అది ఎంత వరకూ ఉంటుందనేది ఎవరూ చెప్పలేరు. తాజాగా బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌, నటి కత్రినా కైఫ్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ‘ఉరి’ స్టార్‌ ఓ షోకి రాగా అందులో వీరిద్దరి బంధం గురించి హోస్ట్‌ టీస్‌ చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

హిందీ టీవీ పరిశ్రమలో పాపులర్‌ షో ‘కపిల్‌ శర్మ షో’. దానికి కపిల్‌ శర్మ హోస్ట్‌. ఈ షోకి ఎంతోమంది బాలీవుడ్‌ సెటబ్రిటీలు తమ సినిమా ప్రమోషన్‌ వస్తుంటారు. అలాగే తాజాగా ‘సర్దార్ ఉదం’ సినిమా ప్రచారం కోసం ఆ సినిమా హీరో విక్కీ, డైరెక్టర్‌ సుజిత్ సర్కార్  వచ్చారు. 

విక్కీ, క్యాట్‌ డేటింగ్‌లో ఉన్న విషయాన్ని మీడియాకి తెలియనియకుండా జాగ్రత్త పడుతున్నట్లు, అసలు వాళ్ల మధ్యలో ఏం ఉందో అందరికి తెలియజేయాలని హోస్ట్‌ టీజ్‌ చేశాడు. దీంతో ఇబ్బంది పడ్డ యంగ్‌ హీరో నవ్వుతూ ముఖాన్ని దాచుకున్నాడు. అయితే షో జడ్జి అర్చనా పురాన్ సింగ్ మాట్లాడుతూ..‘ఈ పుకార్లు ఎంతవరకూ నిజమో తెలియదు. కానీ కపిల్‌ నిప్పుకి ఆజ్యం పోస్తున్నారు’ అని తెలిపింది. దీనికి స్పందనగా విక్కీ నాకు సోదరుడని, కాబట్టి నిజం చెప్పాలనివ్వాలని కపిల్‌ అనడం అక్కడ నవ్వులు పూశాయి. ఆ ఎపిసోడ్‌కి సంబంధించిన వీడియోని నెట్‌లో పెట్టడంతో అది వైరల్‌గా మారింది.

విక్కీ, కత్రినా గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. ఈ విషయాన్ని వారు ధృవీకరించలేదు కానీ పార్టీలలో కలిసి కనిపించారు. న్యూ ఇయర్‌ సందర్భంగా ట్రిప్‌కి కూడా వెళ్లారు.

చదవండి: ఆ గాట్లు పెట్టినవి కాదు.. ఆ సినిమా సమయంలో నిజంగా అయ్యాయి: యంగ్‌ హీరో

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌