amp pages | Sakshi

Family Star Trailer: దేవుడా.. ఉన్నదాన్ని చెడగొట్టకు..

Published on Thu, 03/28/2024 - 11:52

గీత గోవిందం.. ఆరేళ్ల కింద వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్స్‌ రాబట్టింది. అంతేనా.. మ్యూజికల్‌ హిట్‌ కూడా! ఇన్నాళ్ల తర్వాత గీతా గోవిందం కాంబో రిపీట్‌ అయింది. విజయ్‌ దేవరకొండ హీరోగా పరశురామ్‌ దర్శకుడిగా, గోపీ సుందర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఫ్యామిలీ స్టార్‌ తెరకెక్కింది. సీతారామం బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన కల్యాణి.. వచ్చా.. వచ్చా పాట జనాలకు ఇట్టే కనెక్ట్‌ అయింది. గురువారం ఫ్యామిలీ స్టార్‌ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

స్వామీ చెడగొట్టకు
'స్వామీ, నువ్వు కొత్తగా నా లైఫ్‌లో బ్రేకులేమీ ఇవ్వాల్సిన పని లేదు. ఉన్నదాన్ని మాత్రం చెడగొట్టకు' అని దేవుడిని హీరో వేడుకోవడంతో ట్రైలర్‌ మొదలవుతుంది. హీరోయిన్‌.. హీరో కుటుంబంతో కలిసిపోవడం.. తర్వాత సమస్యలు ఎదురవడం.. ఆమెతో ఎవరూ మాట్లాడొద్దని చెప్పిన హీరోయే చివరికి హీరోయిన్‌ వెనకాల తిరగడం సరదాగా అనిపిస్తాయి. భయపడాలి.. ఇంకోసారి.. ఎవరైనా.. చులకనగా మాట్లాడాలంటే.., నేను నీ లైఫ్‌లోకి రావడమే ప్రాబ్లమ్‌.. వంటి డైలాగ్స్‌ బాగున్నాయి.

చెంప చెళ్లుమనిపించింది
ట్రైలర్‌ ముగింపులో హీరో చెంప చెళ్లుమనిపించే సీన్‌ మాత్రం హైలైట్‌! ట్రైలర్‌ ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఉందంటున్నారు రౌడీ హీరో ఫ్యాన్స్‌. మరి థియేటర్లలో ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇకపోతే ఫ్యామిలీ స్టార్‌ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మించారు. ఏప్రిల్‌ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్‌ కానుంది.

చదవండి: సినిమా మొత్తం ఒకే పాత్ర... ఓటీటీలో తెలుగు హారర్‌ మూవీ

Videos

టీడీపీ సర్పంచ్ కి 11 లక్షల సంక్షేమ పథకాలు...అది సీఎం జగన్ సంస్కారం..

విశాఖపై టీడీపీ కొత్తరాగం

పేదలపై చంద్రబాబు పెత్తందారీ కుట్ర

సముద్రంలో చేపలు పట్టిన KA పాల్

నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి లు చెప్పేవి అన్ని అబద్ధాలే..

బాచుపల్లిలో ఘోర ప్రమాదం

మేము ఎప్పుడో గెలిచాం..మెజారిటీ కోసం చూస్తున్నాం..

నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్

సర్వే పై సంచలన విషయాలు బయటపెట్టిన కెఎస్ ప్రసాద్..

బూతు అస్త్రం ప్రయోగిస్తున్న బాబు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?