amp pages | Sakshi

విజయ్‌ దూకుడు.. క్రీడారంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ‘రౌడీ’ హీరో

Published on Mon, 01/23/2023 - 09:34

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన మ్యానరిజం, తెలంగాణ వాక్చాతుర్యంతో యువతను బాగా ఆకట్టుకున్నాడు. వెండితెరపై సినిమాల్లో హీరోగా అలరించి విజయ్‌ తాజాగా క్రిడారంగంలోకి అడుగుపెట్టాడు. ఇండియాలోనే నెంబర్‌ వన్‌ ప్రొఫెషనల్‌ టీమ్‌లలో ఒకటైన  హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ సహ యజమానిగా మారాడు. తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్కటీమ్‌ హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌. ఈ టీం సహ యజమానిగా మాత్రమే కాకుండ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా వ్యవహరించనున్నాడు.

ఈ సందర్భంగా బ్లాక్‌హాక్స్‌ ముఖ్య యజమాని అభిషేక్‌ రెడ్డి కనకాల మాట్లాడుతూ ‘‘విజయ్‌ మాతో చేరడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌ మరియు సహ యజమానిగా వ్యవహరించనున్నారు.  ఆయన తనతో పాటుగా టీమ్‌కు  నూతన విధానం తీసుకురావడం వల్ల మా బ్రాండ్‌ను మరో దశకు తీసుకువెళ్లగలము. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల సంస్కృతి, స్ఫూర్తికి ప్రాతినిధ్యం వహించాలనే మా లక్ష్య సాధన దిశగా అతి పెద్ద ముందడుగనూ వేశాము. రాబోయే వాటి గురించి మేము చాలా సంతోషంగా ఉన్నాము’’ అని ఆయన పేర్కొన్నాడు.

అలాగే విజయ్‌ మాట్లాడుతూ.. ‘‘బ్లాక్‌ హాక్స్‌ మరో స్పోర్ట్స్‌ టీమ్‌ అని కాకుండా అంతకు మించినది. తెలుగు వారసత్వం సగర్వంగా ప్రదర్శించాలనుకునే మా అందరికీ ఇది గర్వ కారణం. తెలుగు ప్రజలకు ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. అంతేకాదు, మన స్ఫూర్తి మరియు శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. మా బ్రాండ్‌ మరియు టీమ్‌ను భారతదేశం మాత్రమే కాదు, ఇతర ప్రాంతాలకు సైతం తీసుకువెళ్లేందుకు చేయాల్సినంతగా నేను చేస్తాను’’ అని విజయ్‌ చెప్పుకొచ్చాడు.

కాగా హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ అనేది ప్రొఫెషనల్‌ మెన్స్‌ వాలీబాల్‌ టీమ్‌. హైదరాబాద్‌ కేంద్రంగా ఇది ఉంది. అతి తక్కువ వయసు సగటు కలిగిన ఈ టీమ్‌, ఎడతెగని శక్తి మరియు స్ర్కిప్ట్‌కు ఆవల ఆలోచించడం పట్ల మక్కువ కలిగింది. తమ ముఖ్య యజమాని అభిషేక్‌ రెడ్డి కంకణాల యొక్క లక్ష్యంకు అనుగుణంగా ఈ టీమ్‌ , కోర్ట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయడంతో పాటుగా కోర్ట్‌ వెలుపల అభిమానులతో అనుసంధానించబడటం ద్వారా ప్రాచుర్యం పొందింది.  ఈ బ్లాక్‌హాక్స్‌ టీమ్‌ తొలి సీజన్‌లో సెమీ ఫైనలిస్ట్‌గా నిలిచింది. హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో అహ్మాదాబాద్‌ డిఫెండర్స్‌ చేతిలో ఓడింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)