amp pages | Sakshi

బాలయ్యతో తలపడనున్న తమిళ విలక్షణ నటుడు

Published on Fri, 08/13/2021 - 13:33

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఎన్‌బీకే107 అనే వర్కింగ్‌ టైటిల్‌తో బాలకృష్ణ పుట్టిన రోజు అధికారిక ప్రకటన వెలువడింది. ఇందులో ఇప్పటికే బాలయ్య సరసన మెహ్రీన్‌ను ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ మూవీలో మెయిన్‌ విలన్‌ పాత్ర కూడా బయటకు వచ్చింది. యాక్షన్, ఎమోషనల్‌తో కూడిన పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌తో వస్తున్న చిత్రమిది. అందుకే ఇందులో బాలయ్యతో తలపడేందుకు పవర్‌ ఫుల్‌ విలన్‌ క్యారెక్టర్‌ను రూపొందించాడు డైరెక్టర్‌. ఇందుకోసం గోపీచంద్ మలినేని  తమిళ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 

తమిళంలో విజయ్ సేతుపతికి విలక్షణ నటుడిగా మంచి క్రేజ్ ఉంది. ఇక ఇటీవల కాలంలో తెలుగులోను ఆయన బాగా పాప్యులర్ అయ్యాడు. 'ఉప్పెన' సినిమాలో ఆయన విలనిజం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో విజయ్‌ సేతుపతికి ఆఫర్లు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విజయ్‌కు ఉన్న విలనిజం క్రేజ్‌ దృష్ట్యా దర్శకుడు ఈ మూవీలో ఆయనను విలన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఎస్‌ఎస్‌ తమన్‌ స్వరాలు సమకుర్చనున్నాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)