amp pages | Sakshi

‘బీస్ట్‌’ సినిమా రిలీజ్‌.. ఫ్యాన్స్‌ని హెచ్చరించిన విజయ్‌

Published on Fri, 04/08/2022 - 21:35

సాక్షి, చెన్నై: బీస్ట్‌ చిత్ర విడుదల నేపథ్యంలో అభిమానుల దూకుడుకు కళ్లెం వేయడానికి సినీ నటుడు దళపతి విజయ్‌ సిద్ధమయ్యారు. రాజకీయ పార్టీలను, అధికారుల్ని విమర్శించే విధంగా, అవహేళన చేసే రీతిలో వ్యవహరించ వద్దంటూ ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.  గత కొన్నేళ్లుగా విజయ్‌ నటించిన చిత్రాలన్నీ వివాదాల నడుమ తెర మీదకు వచ్చిన విషయం తెలిసిందే. విడుదలకు ముందుగా చోటు చేసుకునే పరిణామాలే  దీనికి ప్రధాన కారణం అవుతూ వచ్చాయి.

ఈ పరిస్థితుల్లో తమిళ కొత్త సంవత్సరానికి ఒక రోజు ముందుగా ఈనెల 13వ తేదీ విజయ్‌ నటించిన బీస్ట్‌ చిత్రం తెర మీదకు రానుంది. ఈ చిత్రం విడుదల వివాదాలకు తావ్వివకుండా దళపతి ముందు జాగ్రత్తల్లో పడ్డారు. ఏడాది తర్వాత తన చిత్రం విడుదల అవుతుండటంతో అభిమానుల దూకుడు, వివాదాలకు చెక్‌ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా గురువారం విజయ్‌ మక్కల్‌ ఇయక్కం ప్రధాన కార్యదర్శి బుషి ఆనంద్‌ అభిమాన సంఘాల్ని హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేశారు.

చట్ట పరంగా చర్యలు.. 
రాజకీయ పార్టీలను, పదవుల్లో ఉన్న వారిని, అధికారుల్ని ... ఇలా ఎవ్వరినీ విమర్శించ వద్దని హెచ్చరించారు. మీడియాలో కానీ, సామాజిక మాధ్యమాల్లో గానీ.. ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. మీమ్స్‌ వంటి అవహేళన చేసే ధోరణుల్ని అనుసరించ వద్దు అని హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై గతంలో కఠినంగా వ్యవహరించి, అభిమాన సంఘం నుంచి తొలగించినట్టు గుర్తు చేశారు. ఈసారి ఆజ్ఞలను అతిక్రమించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు సైతం తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించడం గమనార్హం.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌