amp pages | Sakshi

నెలాఖరు నాటికి పట్టాలు పంపిణీ చేయాలి

Published on Sat, 03/25/2023 - 01:52

ములుగు: మార్చి నెలాఖరు నాటికి భూ క్రమబద్ధీకరణ పట్టాలను సిద్ధం చేసిన అర్హులైన వారికి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతికుమారి ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్‌ నుంచి శుక్రవారం రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి ప్రభుత్వ పథకాలపై సమీక్ష నిర్వహించారు.

జాతీయ రహదారుల వెంబడి ఉన్న చెట్లను కాపాడుకోవాలని, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను సంరక్షించాలన్నారు. ఆరోగ్య మహిళ ప్రత్యేక క్యాంపుల నిర్వహణలో భాగంగా అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాలని ఏటీడీఏ పీఓ అంకిత్‌కు సూచించారు. సోషల్‌ ఆడిట్‌ రికార్డులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కంటి వెలుగు ప్రిస్క్రీప్షన్‌ ఆధారంగా అద్దాలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఆరోగ్య మహిళ కేంద్రాల్లో అందిస్తున్న చికిత్సపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. త్వరలో పోడు భూముల పట్టాల అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల నివారణపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వైకుంఠధామాల పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాలని సూచించారు. అన్ని వైకుంఠ ధామాల్లో విద్యుత్‌, నీటి సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలన్నారు. గ్రామీణ క్రీడా ప్రాంతాల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని, త్వరలో ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు విషయంలో ఉపాధ్యాయులు, అధికారులు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీఓ అంకిత్‌, అడిషనల్‌ కలెక్టర్‌ (రెవెన్యూ), వైవీ గణేశ్‌, అడిషనల్‌ కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) ఇలా త్రిపాఠి, డీఆర్వో కూతాటి రమాదేవి, డీఆర్డీఓ నాగపద్మజ, డీఎంహెచ్‌ఓ అల్లెం అప్పయ్య, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగదీశ్‌, డీపీఓ వెంకయ్య, డీఈఓ పాణిని, జిల్లా వ్యవసాయశాఖ అధికారి గౌస్‌ హైదర్‌, జిల్లా ఉద్యానశాఖ అధికారి రమణ, ఇంటర్మీడియేట్‌ అధికారి వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలి

‘పది’ పరీక్షలను

పకడ్బందీగా నిర్వహించాలి

సీఎస్‌ శాంతికుమారి

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?