amp pages | Sakshi

అన్నా ఉద్యమాన్ని మోసం చేసి ‘ఆప్‌’ పుట్టింది: హర్యానా మంత్రి

Published on Wed, 03/16/2022 - 16:24

హర్యానా: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్‌ ఆద్మీ పార్టీపై హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌.. 2011లో సామాజికవేత్త అన్నా హజారే చేపట్టిన అవినీతికి వ్యతిరేక ఉద్యమాన్ని మోసం చేశారని మండిపడ్డారు. అన్నా హజారే ఉద్యమన్ని మోసం చేయడం వల్లనే ఆప్‌ పుట్టిందని అన్నారు. ‘ఢిల్లీలో అన్నా హజారే చేపట్టిన ఆందోళనను మోసం చేయడం వల్లే ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టింది. పంజాబ్ ప్రజలు అటువంటి వారిని(ఆప్‌) ఎన్నుకున్నారు, భవిష్యత్తులో వారు తమ వాగ్దానాలను నెరవేర్చగలరో? లేదా విఫలమవుతారో? చూద్దాం’ అని అన్నారు. 

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రి అనిల్‌ విజ్‌.. ఆప్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆప్‌ ఢిల్లీ వీధుల్లో మద్యం అమ్మడంలో ప్రావీణ్యం సంపాదించిందని దుయ్యబట్టారు. అటువంటి పార్టీ పంజాబ్‌లో గెలవడం వల్ల ఆ రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారుతుందని అన్నారు. పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పంజాబ్‌ ముఖ్యమంత్రిగా భగవంత్‌ మాన్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. భగత్‌ సింగ్‌ స్వస్థలం ఖతర్‌ కలన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించిన సంగతి విదితమే.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)