amp pages | Sakshi

థ్రిల్లర్‌ సినిమాను తలపించే కథ...పాపం కొడుకు కోసం ఆ తల్లే..

Published on Wed, 12/07/2022 - 15:21

ఎన్నో క్రైం స్టోరీలను విని ఉంటాం. ఆ కేసుల్లో చాలామటుకు హత్య చేయడం.. తప్పించుకునేందుకు రకరకాలుగా ట్రై చేసి చివరికి ఎక్కడో ఒక చోట దొరికపోవడం జరుగుతోంది. కానీ ఇక్కడ ఒక వ్యక్తి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అధికారులు హత్య కేసులో ఇరికించి జైలు పాలు చేశారు. దీంతో తల్లే కొడుకును కాపాడేందుకు రంగంలో దిగి రక్షించుకునే తాపత్రయాన్ని.. చూస్తే సినిమానే తలిపించే కథలా ఉంటుంది ఈ క్రైం స్టోరీ.

వివరాల్లోకెళ్తే...యూపీలోని అలీఘర్‌లో 2015లో 15 ఏళ్ల బాలిక కనిపించకుండా పోవడంతో ఆమె తండ్రి గోండా పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విష్ణు అనే యువకుడిని అదుపులోకి తీసుకుని పెళ్లికి ప్రలోభ పెట్టి కిడ్నాప్‌ చేసినట్లుగా నేరాలు మోపి కేసు నమోదు చేశారు. కొంతకాలం తర్వాత ఆగ్రాలో ఒక బాలిక అనుమానస్పద మృతి వార్తను చూసి సదరు అమ్మాయి తండ్రి ఆ బాలిక తన కుమార్తెగా గుర్తించాడు. దీంతో విష్ణుపై హత్య నేరం కింద కేసు నమోదు జైలుకి పంపారు అధికారులు.

ఐతే నిందితుడు విష్ణు తల్లి ఈ ఆరోపణలు అవాస్తవం అని నిరూపించి తన కొడుకును ఈ కేసు నుంచి బయటపడేలా చేయాలనకుంది. అందులో భాగంగా తానే స్వయంగా రంగంలోకి దిగి ఈ కేసును చేధించేందుకు పూనుకుంది. ఇక్కడే ఈ కేసులో అసలు ట్విస్ట్‌ మొదలవుతుంది. ఈ మేరకు ఏ అమ్మాయి ఐతే కిడ్నాప్‌ అయ్యి హత్యకు గురయ్యిందన్నారో ఆ అమ్మాయి బతికే ఉందని ఈ తల్లి గుర్తించింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ​అందించింది.

ఈ క్రమంలో పోలీసులు సదరు బాధితురాలిని హత్రాస్‌లో ట్రాక్‌ చేసి అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపర్చి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఐతే ఈ కేసులో మరింత ముందకు వెళ్లాడానికి ఆమెకు డీఎన్‌ఏ టెస్ట్‌లు కూడా నిర్వహించనున్నట్లు పోలీస్‌ అధికారి సింగ్‌ చెప్పారు. ఆ తదనంతరం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఐతే ఆ ఘటనలో ఆ అమ్మాయికి ప్రస్తుతం 22 ఏళ్లు కాగా, నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు విష్ణుకి 25 ఏళ్లు.

దాదాపు ఏడేళ్ల తర్వాత గానీ ఈ కేసు ఒక కొలిక్కి రాలేదు. ఈ మేరకు విష్ణు తల్లి తన కొడుకు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈ కేసులో ఇరుకిస్తున్నారని తెలిసి.. తానే స్వయంగా రంగంలోకి దిగి దర్యాప్తు చేసినట్లు తెలిపింది. అతడి నిర్దోషిత్వాన్ని నిరూపించేందకు తాను ఈ బాధ్యత తీసుకున్నాని చెప్పింది. 

(చదవండి: అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు.! ప్రియుడితో కలిసి భార్యే..)

Videos

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

పవన్ కళ్యాణ్ ఊగిపోయే స్పీచ్ కి పిఠాపురం శేషు కుమార్ స్ట్రాంగ్ కౌంటర్

ఏపీలో వైఎస్ఆర్ సీపీకి మద్దతు ప్రకటించిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్

నా కొడుకు కోసం బందరులో ఎక్కడైనా అడుగు.. ఒక్కటే సమాధానం

మంగళగిరిలో నారా లోకేష్ మొహం చూపించుకోలేకపోతున్నాడు..!

పవన్ కళ్యాణ్ ని వంగా గీత ఒక్క మాట కూడా అనలేదు.. అది ఆమె సంస్కారం..!

Watch Live: నరసాపురంలో సీఎం జగన్ ప్రచార సభ

సీదిరి అప్పలరాజు స్పెషల్ ఇంటర్వ్యూ

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)