amp pages | Sakshi

ద్యావుడా, అల్లు అర్జున్‌ను ఇలా వాడుకున్నారా?

Published on Sun, 02/21/2021 - 12:45

సన్నివేశం.. కారులో వెళుతున్న పోలీసు కుటుంబాన్ని యాక్సిడెంట్‌ చేసి చంపేందుకు ప్లాన్‌ వేస్తాడు మద్దాలి శివారెడ్డి. ఎదురుగా యమస్పీడుతో వస్తున్న వాహనాన్ని చూసి భయపడిపోయిన ఆ ఫ్యామిలీ కారులో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ కారు డోర్లు లాక్‌ అయిపోతాయి. ఇక చావు తథ్యం అని అందరూ కళ్లు మూసుకోగా వారిని కాపాడేందుకు బుల్లెట్‌లా బైక్‌ మీద దూసుకొచ్చి విలన్స్‌కు షాకిస్తాడు ఓ యంగ్‌ పోలీస్ అదేనండీ అల్లు అర్జున్‌‌. అతడిని చూడగానే రౌడీలు సడన్‌ బ్రేక్‌ వేస్తారు. ఇంకేముందీ, కారు అద్దాల్లోంచి గాల్లోకి లేచి కొద్ది అడుగుల దూరంలో పడిపోతారు విలన్లు. ఈ సీన్‌ ఏ సినిమాలోనిదో ఈపాటికే అర్థమై ఉంటుంది.

బన్నీ కెరీర్‌లో భారీ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ఒకటైన 'రేసుగుర్రం'లో వచ్చే ఓ కీలక సన్నివేశమిది. ఇప్పుడిదంతా ఎందుకంటే కేరళ పోలీసులు ఈ సీన్‌ను ప్రజల రక్షణ కోసం వాడేసుకున్నారు. ఆ వీడియోలో అల్లు అర్జున్‌ ప్రమాదంలో ఉన్న తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడో పోల్‌ యాప్‌ మీ దగ్గరుంటే మిమ్మల్ని కూడా మేము అలాగే కాపాడుకుంటాం అని చెప్తున్నారు పోలీసులు. కేవలం ఒక్క క్లిక్‌తో క్షణాల్లో మీ ముందు వాలిపోతామని చెప్తున్నారు. ఏదేమైనా ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మా బన్నీని ఇలా వాడుకున్నారన్నమాట అని అల్లు అర్జున్‌ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఆ పోలీసుకు హెల్మెట్‌ కూడా ఉంటే బాగుండేది అని విమర్శలు గుప్పిస్తున్నారు.

చదవండి: అల్లు అర్జున్‌ కోలీవుడ్‌ ఎంట్రీ.. అతడే డైరెక్టర్‌?

పుష్ప: హాలీవుడ్‌ తరహాలో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌..

Videos

ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్

అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Photos

+5

తాగుడుకు బానిసైన హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)