amp pages | Sakshi

‘ఏడవకురా.. ఏప్రిల్‌లో వెళ్లిపోతాం లే’

Published on Fri, 10/22/2021 - 14:11

ఈఇటానగర్‌: ప్రతి మనిషి జీవితంలో బాల్యం అందమైన జ్ఞాపకంగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికి మన బుర్రలో స్వార్థం, ద్రోహం, మోసం, పేద, ధనిక తేడాలు వంటి దుర్మార్గపు ఆలోచనలు ఉండవు. మనసు నిర్మలంగా.. కల్లాకపటం లేకుండా ఉంటుంది. అందరితో కలిసి పోతాం.. త్వరగా స్నేహం చేస్తాం. ఆ వయసులో మనలో జాలి, దయ, కరుణ మాత్రమే ఉంటాయి. మన నేస్తం బాధపడితే చూడలేం. ఏదోలా వారిని ఓదారుస్తాం.

ఇక చిన్నారుల్లో స్నేహం ఎంత నిజాయతీగా ఉంటుందో తెలిపే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. హాస్టల్‌కి వెళ్లిన ఓ చిన్నారి అమ్మ గుర్తుకువచ్చి ఏడుస్తాడు. అది చూసి వాడి స్నేహితురాలు ‘ఏడవకురా.. ఏప్రిల్‌లో వెళ్లిపోతాంలే’ అంటూ ఓదారుస్తుంది. ఈ చిన్నారుల క్యూట్‌ సంభాషణకు సంబంధించిన వీడియో ప్రసుత్తం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..

ఈ సంఘటన అరుణాచల్‌ ప్రదేశ్‌ తవాంగ్‌ ప్రాంతంలోని ఓ హాస్టల్‌లో చోటు చేసుకుంది. వీడియోలో ఓ చిన్న పిల్లాడు తన అమ్మ గుర్తుకు వచ్చి.. ఏడుస్తూ ఉంటాడు. అది గమనించి ఆ పిల్లాడి స్నేహితురాలు దగ్గరకు వెళ్లి ఓదారుస్తుంది. ‘‘అరే ఏడవకురా.. ఊర్కో. అమ్మ గుర్తుకు వస్తుందా.. ఏడవకు.. ఏప్రిల్‌లో వెళ్లిపోతాం లే’’ అంటూ తనకు తోచిన రీతిలో తన స్నేహితుడిని ఓదారుస్తుంది. 
(చదవండి: భారత్‌లో అందరికంటే ముందు నిద్రలేచే గ్రామం ఏదో తెలుసా?)

‘‘ప్రేమ అనేది మానవుల సహజ లక్షణం.. అలవాటు చేసుకుంటే అయ్యేది కాదు. ప్రేమ విశ్వవ్యాప్తం.. దానికి ఎంతో శక్తి ఉంది. ప్రేమిస్తూ ఉండండి.. హాస్టల్‌లో ఉన్న ఈ ఇద్దరు చిన్నారులు ఒకరినొకరు ఎలా ఓదార్చుకుంటున్నారో చూడండి’’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు.. ఎంత క్యూట్‌గా ఉన్నారో.. నాకు నా బాల్యం గుర్తుకు వచ్చింది. ఎంత అందమైన బంధమో కదా అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు.
(చదవండి: మేకింగ్‌ ఆఫ్‌ ఎ క్వీన్‌.. పచ్చళ్ల మహారాణి)

చదవండి: నాన్నా బాగానే ఉన్నా అంటూ చివరి ఫోన్‌కాల్‌.. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)