amp pages | Sakshi

ప్రపంచాన్ని తాకిన ‘వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్’ ఘుమఘుమలు

Published on Thu, 10/19/2023 - 10:11

‘‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’’ ‘బొమ్మరిల్లు’ హాసిని చెప్పిన ఈ డైలాగ్‌.. కప్పు కాఫీ తాగుతూ, నాలుగు మాటలు మాట్లాడుకోవడంలోని మజాని తెలియజేస్తుంది. చాలామందికి పొద్దున్నే సూర్యుని కన్నా ముందుగా కాఫీ కనిపిస్తుంది. దానిని ఆస్వాదించిన తరువాతనే వారి దినచర్య మొదలవుతుంది. ఏది ఏమైనా కాఫీ సేవనం మనలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుందనడంలో సందేహం లేదు. 

ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే ఇటీవల బెంగళూరులో జరిగిన 5వ వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ (డబ్ల్యుసీసీ) ఘుమఘుమలు ప్రపంచాన్నంతటినీ తాకాయి. 2023 సెప్టెంబర్ 25 నుండి 28 వరకు బెంగళూరులోని ప్రసిద్ధ బెంగళూరు ప్యాలెస్‌లో వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ జరిగింది. కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం, కాఫీ పరిశ్రమల సహకారంతో అంతర్జాతీయ కాఫీ సంస్థ (ఐసీఓ)ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ సదస్సును ప్రారంభించారు.

నాలుగు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో పలు సమావేశాలు, స్కిల్ బిల్డింగ్ వర్క్‌షాప్‌లు, స్టార్టప్ సమ్మిట్‌లు నిర్వహించారు. అలాగే పలు రకాల పోటీలు నిర్వహించి, విజేతలకు బహమతులు, అవార్డులు అందజేశారు. ప్రపంచ కాఫీ సమ్మేళనంలో 2400 మంది ప్రతినిధులు, 128 మంది స్పీకర్లు, 208 మంది ఎగ్జిబిటర్లు, 10 వేల మంది సందర్శకులు పాల్గొన్నారు.
 
ప్రస్తుతం 60 దేశాల్లో కాఫీని పండిస్తుండగా, యూరప్, అమెరికా, జపాన్ తదితర దేశాలు ఈ విషయంలో  ముందంజలో ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద కాఫీ వినియోగదారుగా అమెరికా అగ్రస్థానంలో ఉండగా, భారీ కాఫీ ఉత్పత్తిదారుగా బ్రెజిల్ నిలిచింది. కాఫీని అధికంగా ఉత్పత్తి చేసే ఆరు దేశాల సరసన భారత్ కూడా చేరింది.
ఇదికూడా చదవండి: క్షిపణి దాడుల మధ్య వార్‌ జోన్‌కు బైడెన్‌ ఎలా చేరారు?

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)