amp pages | Sakshi

పానీ పూరీ జ్యువెల్లరీ: పెళ్లికూతురి వైరల్‌ వీడియో

Published on Tue, 07/06/2021 - 16:39

సాక్షి, ముంబై: పానీ పూరీ అంటే చాలామంది అమ్మాయిలు లొట్టలేసుకుంటూ తింటారు. లాక్‌డౌన్‌ కాలంలో కూడా పానీ పూరీకోసం ఎగబడిన దృశ్యాలను చూశాం. ఇండియాలో స్ట్రీట్ ఫుడ్‌లో  పానీ పూరీ లేదా గోల్ గప్పా కున్న స్పెషాల్టీ అది. కానీ పానీ పూరీ కిరీటం పెట్టుకున్న పెళ్లికూతుర్ని మాత్రం ఎక్కడా చూడ లేదు. అందుకే  ఈ పానీ పూరీ స్పెషల్‌ పెళ్ళి కూతురి వీడియో  వైరల్‌గా మారింది.

సాధారణంగా పెళ్లి అనగానే  కాబోయే పెళ్ళి కూతుళ్ల హడావిడి అంతా ఇంతాకాదు. పెళ్లి చీరలు, డిజైనర్‌ బ్లౌజ్‌లు, వీటన్నింటికీ మించి వారు ధరించే నగలపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. కానీ ఒక ఈ వధువు మాత్రం పానీ పూరిపై ప్రేమను  తెలిపేందుకు మరో అడుగు ముందుకేసింది.  సాధారణ నగలతో పాటు ఏకంగా  పానీ పూరీ నగల్ని ధరించింది. వెరైటీ పానీపూరీ నగలతో ఉన్న నవ వధువును బంధువులు సరదాగా ఆటపట్టిస్తోంటే సిగ్గుతో ఆమె చిరునవ్వులు చిందించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. వాస్తవానికి ఒక బ్రైడల్‌ మేకప్‌ సంస్థ ఈ వీడియోను పోస్ట్‌ చేసింది. అయితే అనూహ్యంగా ఈ వీడియోలోని పానీ పూరీలు హైలైట్‌ కావడం విశేషం. 

లక్షా పదివేలకు పైగా లైక్స్‌  సాధించిన ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఔరా! గోల్‌ గప్పా ప్రేమా అంటూ నోరెళ్లబెడుతున్నారు. మరికొందరైతే  తామూ కూడా  ఫాలో అవుతాం.. తామూ ఇలాగే చేస్తామంటూ మురిసిపోతూ వ్యాఖ్యానించడం కొసమెరుపు.

Videos

విశాఖపై టీడీపీ కొత్తరాగం

పేదలపై చంద్రబాబు పెత్తందారీ కుట్ర

సముద్రంలో చేపలు పట్టిన KA పాల్

నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి లు చెప్పేవి అన్ని అబద్ధాలే..

బాచుపల్లిలో ఘోర ప్రమాదం

మేము ఎప్పుడో గెలిచాం..మెజారిటీ కోసం చూస్తున్నాం..

నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్

సర్వే పై సంచలన విషయాలు బయటపెట్టిన కెఎస్ ప్రసాద్..

బూతు అస్త్రం ప్రయోగిస్తున్న బాబు

టీడీపీ నేతకు బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?