amp pages | Sakshi

Chhattisgarh: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం తీపికబురు.. ఇక నుంచి..

Published on Wed, 01/26/2022 - 15:12

ఛత్తీస్‌ఘడ్‌: భారతదేశమంతట 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్​ఘడ్​ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్​ బఘెల్..​ ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి ఐదురోజుల పని దినాలతో పాటు పలు విధానపర నిర్ణయాలను ప్రకటించారు.

అదే విధంగా, పెన్షన్​ పథకంలో రాష్ట్రప్రభుత్వం వాటాను 10 నుంచి 14 శాతానికి పెంచుతున్నట్లు ట్విటర్​ వేదికగా వెల్లడించారు. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులలో సామర్థ్యం, ఉత్పాదకతను పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు భూపేష్​ బఘెల్​ తెలిపారు. ఆయా నివాస ప్రాంతంలో వ్యాపారాలు చేసే చిరువ్యాపారుల కోసం ప్రత్యేకంగా చట్టబద్ధత కల్పించే చట్టాన్ని ప్రవేశపెడుతన్నట్లు పేర్కొన్నారు.

ఇది చిరువ్యాపారులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ప్రజా భద్రతకు ఇబ్బందులు కల్గించే ఎలాంటి అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బిల్డింగ్​ కోడ్​లోని నిబంధలను అందరు పాటించాలని సూచించారు. ప్రస్తుతం మున్సిపల్​ కార్పొరేషన్​లలో సెకండ్​ బిల్డింగ్​ పర్మిషన్​ పథకానికి అనుగుణంగా ప్రణాళిక నిబంధనలు  రూపొందిస్తున్నామని తెలిపారు.

ఉపాధి కల్పనతోపాటు రవాణా సౌకర్యాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా రవాణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటు లెర్నింగ్​ డ్రైవింగ్​ లైసెన్స్​ జారీ నిబంధలను  సులభతరం చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. మహిళల భద్రత కోసం మహిళ సేఫ్టీ సెల్స్​ను ఏర్పాటు చేస్తామని  భూపేష్​ బఘెల్​ ప్రకటించారు. ఛత్తీస్​ఘడ్​ ప్రాంతంలో దట్టమైన అడవులతో కూడి ఉంటుంది.

ఈ క్రమంలో గిరిజనులు ఎక్కువగా జీవనోపాధి కోసం అడవులపై ఆధారపడతారు. వీరి కోసం అటవీ వాసులకు సంబంధించిన నిబంధనలను సరళతరం చేయనున్నట్లు సీఎం తెలిపారు.  పారిశ్రామిక విధానంలో మార్పులు చేయనున్నట్లు  పేర్కొన్నారు. ఇండస్ట్రీయల్​ పార్కుల్లోని ప్లాట్లలో 10 శాతం భూమిని ఓబీసీ వర్గానికి రిజర్వు చేయనున్నట్లు తెలిపారు.

ప్రధానంగా రైతుల కోసం 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి పప్పుధాన్యాలకు కూడా కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని సీఎం తెలిపారు. అలాగే కార్మికులకు జన్మించిన  మొదటి ఇద్దరు ఆడపిల్లలకు ఒక్కొక్కరికి 20,000 వేల చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు  భూపేష్​ బఘెల్​ తెలిపారు.

చదవండి:  టెన్షన్‌.. టెన్షన్‌..! పశ్చిమ యూపీలో ఒక్కో ఓటుకై పార్టీల ఆరాటం

Videos

టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా

ఆవిడ ఉత్తరం రాస్తే అధికారులను మార్చేస్తారా..!

ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య

వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?