amp pages | Sakshi

భర్తకు దూరంగా ఒంటరి జీవితం.. లవ్‌ యూ అంటూ ఆమెకు దగ్గరై..

Published on Fri, 07/15/2022 - 17:34

భర్తకు దూరంగా ఉంటూ ఆమె(33) జీవనం సాగిస్తోంది. ఇంతలో ఆమెకు ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పరిచయమయ్యాడు. తనను ప్రేమిస్తున్నానని దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహాజీవనం సాగించాడు.ఈ క్రమంలో ఆమెకు శారీరకంగా దగ్గరై.. 14 సార్లు గర్భవతిని చేశాడు. తీరా పెళ్లి విషయం ఎత్తాక.. 14 సార్లు అబార్షన్‌ చేయించాడు. ఇలా నమ్మిస్తూ మోసం చేయడంతో తీవ్ర మసస్థాపానికి గురైన బాధితురాలు చివరకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. ఢిల్లీలోని జ‌త్‌పూర్ ప్రాంతంలో ఓ మహిళ(33) గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆమె డెడ్‌ బాడీ పక్కనే సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, సూసైడ్‌ నోట్‌లో.. తనను ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడని తెలిపింది.

తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. కొన్నేళ్లుగా తనతో సహజీవనం కొనసాగించాడని పేర్కొంది. ఈ క్రమంలో శారీరకంగా దగ్గర అవడంతో 14 సార్లు తనకు అబార్షన్‌ చేయించాడని ఆవేదన వ్యక్తం చేసింది. చివరకు పెళ్లి చేసుకోవాలని నిలదీయంతో.. అతను పెళ్లికి నిరాక‌రించ‌డంతో వేరే దారిలేక ఆత్మహత్య నిర్ణ‌యం తీసుకున్నాన‌ని పేర్కొంది. అయితే, కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా.. ఆమెకు తన భర్త నుంచి విడిపోయే 8 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తోందని తెలిసింది. 

ఇదిలా ఉండగా.. ఆమె పేరెంట్స్‌ బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో నివాసముంటున్నారని అన్నారు. ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారికి అప్పగించినట్లు డీసీపీ తెలిపారు. ఇక, ఈ ఘటనలో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. అతడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: ట్యాక్సీ డ్రైవర్‌తో మహిళా టెక్కీ ప్రేమ పెళ్లి.. తప్పటడుగులు వేశానంటూ..

Videos

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌