amp pages | Sakshi

దీపావళిని ఏ ప్రాంతంలో ఎలా చేసుకుంటారు? బెంగాల్‌ ప్రత్యేకత ఏమిటి?

Published on Tue, 11/07/2023 - 08:39

దీపావళిని దీపాల పండుగ అని కూడా అంటారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. మన దేశంలో ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దేశంలోని అన్నిప్రాంతాలవారు జరుపుకునే పండుగలలో ఇదొకటి. ఇతర దేశాలలోని ప్రవాసులు కూడా దీపావళిని చేసుకుంటారు. ఈ పండుగను హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు తమ సంప్రదాయాల ప్రకారం జరుపుకోవడం విశేషం. దీపావళిని దేశంలో వివిధ ప్రాంతాలలో అక్కడి సంస్కృతి, నమ్మకాల ఆధారంగా జరుపుకుంటారు. 

ఉత్తర భారతదేశంలో 
రాక్షస రాజు రావణుడిని ఓడించిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ దీపావళిని జరుపుకుంటారు. శ్రీరాముడు, సీతామాతలను స్వాగతించడానికి నాటి ప్రజలు నూనె దీపాలను వెలిగించారట. ఆ దీపాలను తమ ఇళ్లు, వీధుల చుట్టూ అలంకరించారట. తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పటాకులు కాల్చి, తీపి వంటకాలు ఆరగిస్తూ కుటుంబ సభ్యులతో  ఆనందంగా గడిపారట. అందుకే నేటికీ దీపావళినాడు ఉత్తరాదిన అందరూ పరస్పరం స్వీట్లు పంచుకుంటారు. 

పశ్చిమ భారతదేశంలో 
ముఖ్యంగా మహారాష్ట్ర,గుజరాత్‌లలో దీపావళిని ఎంతో ఘనంగా, ఉత్సాహంగా  జరుపుకుంటారు. సంపద, శ్రేయస్సులకు దేవతగా భావించే లక్ష్మదేవిని పూజిస్తారు. దీపాల పండుగను పురస్కరించుకుని తమ ఇళ్ల ముంగిట వివిధ రంగులతో అలంకరిస్తూ ముగ్గులు వేస్తారు. పలు సంప్రదాయ వంటలను తయారు చేసి, ఆరగిస్తారు. అలాగే తీపి వంటకాలను తమ స్నేహితులకు, బంధువులకు పంచిపెడతారు.

దక్షిణ భారతదేశంలో 
దీపావళిని నాడు ప్రజలంతా తెల్లవారుజామునే నిద్ర లేచి, తలకు నూనె రాసుకుని స్నానం చేస్తారు. తరువాత కొత్త దుస్తులు ధరిస్తారు. తమ ఇళ్లలో నూనె దీపాలను వెలిగించి, గణేశుడు, లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. పలు రకాల వంటకాలను తయారు చేస్తారు. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఆనందంగా దీపావాళి వేడుకలు చేసుకుంటారు.

తూర్పు భారతదేశంలో 
ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో దీపావళినాడు  కాళీమాత పూజలు చేస్తారు. ఆ రోజు కాళికామాతను పూజించడం వలన శక్తియుక్తులు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. దేవాలయాలు, ఇళ్లలో కాళీమాత విగ్రహాలను ఏ‍ర్పాటు చేసి, వాటికి పూజలు నిర్వహిస్తారు. అలాగే మట్టి ప్రమిదిలలో దీపాలను వెలిగిస్తారు. కాళీమాత విగ్రహాలను ఊరేగిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే పండుగ దీపావళి అనడంలో సందేహం లేదు.  
ఇది కూడా చదవండి: ప్రియాంకకు చేదు అనుభవం: పుష్ఫగుచ్ఛం ఇచ్చారు.. పూలు మరచారు!

Videos

బీసీ నేత ఆర్ కృష్ణయ్యపై పచ్చ రౌడీలు దాడి..

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"

రాజంపేట లో అశేష ప్రజా స్పందన

కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు

గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు

సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు