amp pages | Sakshi

ఈస్టర్న్‌ రైల్వేలో 3366 అప్రెంటిస్‌ ఖాళీలు

Published on Wed, 10/06/2021 - 15:16

కోల్‌కతాలోని ఈస్టర్న్‌ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ).. వివిధ డివిజన్లు, వర్క్‌షాపుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం ఖాళీల సంఖ్య: 3366

► ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, లైన్‌మెన్, వైర్‌మెన్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, మెకానిక్‌(డీజిల్‌) తదితరాలు.

► అర్హత: ట్రేడులను అనుసరించి ఎనిమిదో తరగతి, కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఎన్‌సీవీటీ జారీచేసిన నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికేట్‌ ఉండాలి.

► వయసు: 15–24ఏళ్ల మధ్య ఉండాలి.

► ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 03.11.2021

► వెబ్‌సైట్‌: https://er.indianrailways.gov.in


ఎన్‌పీసీఐఎల్‌లో 75 ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌పీసీఐఎల్‌), కైగా సైట్‌(కర్ణాటక).. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► మొత్తం ఖాళీల సంఖ్య: 75

► ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మెన్, సర్వేయర్‌.

► శిక్షణా వ్యవధి: ఏడాది.

► అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.10.2021

► వెబ్‌సైట్‌: www.npcil.nic.in


ఇస్రో, ఐఐఆర్‌ఎస్‌లో 12 అప్రెంటిస్‌లు

డెహ్రాడూన్‌లోని ఇస్రో–ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌(ఐఐఆర్‌ఎస్‌).. వివిధ విభాగాల్లో డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం ఖాళీల సంఖ్య: 12

► ఖాళీల వివరాలు: డిప్లొమా అప్రెంటిస్‌–10, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌–02.

► డిప్లొమా అప్రెంటిస్‌: విభాగాలు: సివిల్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్‌ ఇంజనీరింగ్, లైబ్రరీ సైన్సెస్‌ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 30ఏళ్లు మించకుండా ఉండాలి. స్టయిపెండ్‌ నెలకు రూ.8000 చెల్లిస్తారు.

► గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: విభాగాలు: జియోఇన్ఫర్మేటిక్స్, లైబ్రరీ సైన్స్‌. అర్హత: ఇంజనీరింగ్‌ డిగ్రీ/బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్‌ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 30ఏళ్లు మించకుండా ఉండాలి. స్టయిపెండ్‌: నెలకు రూ.9000 చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: డిప్లొమా, ఇంజనీరింగ్‌ డిగ్రీలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 09.10.2021

► వెబ్‌సైట్‌: www.iirs.gov.in

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌