amp pages | Sakshi

వైరల్‌: గ్రెటా నిజస్వరూపం ఇదేనా?

Published on Thu, 02/18/2021 - 16:40

గ్రెటా థన్‌బర్గ్‌.. కొద్ది రోజులుగా ఈ పేరు భారత్‌లో మారుమోగుతోందీ. కారణం ఆమె ఢిల్లీలో ఉద్యమించిన రైతులకు మద్దతు తెలపడమే కాదు. ఎప్పుడెప్పుడు ఏయే ఉద్యమాలు చేయాలో రాసి ఉన్న టూల్‌కిట్‌ రిలీజ్‌ చేసి వివాదానికి తెర లేపడమే! దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఈ టూల్‌కిట్‌తో సంబంధం ఉన్నవాళ్ల గురించి పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ క్రమంలో గ్రెటా ఫొటో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. డొక్క ఎండుకుపోయి ఉన్న పేద పిల్లల కళ్లెదురుగా గ్రెటా థన్‌బర్గ్‌ సుష్ఠుగా భోజనం చేస్తోంది. వారు ఆత్రంగా ఆమె వైపు, అక్కడ ఉన్న ఆహార పదార్థాల వైపు దీనంగా చూస్తున్నట్లుందీ ఫొటో.

గ్రెటాకు, ఆ పేద పిల్లలకు మధ్య ఓ అద్దపు కిటికీ అడ్డుగా ఉంది. ఈ ఫొటో చూసిన చాలామంది ఇదే నిజమనుకుని నోరెళ్లబెట్టారు. అంతేకాదు, పైకి నీతులు చెప్పే ఆమె అసలు అవతరాం ఇదీ అని ఎగతాళి చేశారు. ఆమెను నానారకాలుగా తిట్టిపోశారు. కానీ ఇది ఫేక్‌ ఫొటో. రెండు వేర్వేరు ఫొటోలను ఒకే దగ్గర చేర్చి అందరినీ బురిడీ కొట్టించారు. 2007లో ఆఫ్రికాలో తీసిన బక్కచిక్కిన పేద పిల్లల ఫొటో ఒకటి కాగా, గతేడాది డెన్మార్క్‌లో గ్రెటా మధ్యాహ్న భోజనం చేస్తుండగా దిగిన ఫొటో మరొకటి. ఈ రెండింటినీ కలిపేసి ఫేక్‌ ఫొటో సృష్టించి కావాలని దాన్ని వైరల్‌ చేస్తున్నారు. కాబట్టి ఒక్కోసారి కంటికి కనిపించేదంతా నిజం కాదు.

కాగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోని అన్నదాతలు కొన్ని రోజులుగా రోడ్లమీదకొచ్చి నిరసనలు చేస్తున్న విషయం అందరికీ తెలిసింది. ఈ ఆందోళనల సెగ ప్రపంచానికి తాకింది. దీంతో ఎందరో విదేశీ సెలబ్రిటీలు రైతులకు తమ మద్దతు తెలుపుతూ పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో స్వీడన్‌ పర్యావరణ ఉద్యమకారిణి, 18 ఏళ్ల గ్రెటా థన్‌బర్గ్‌ కూడా వారికి సంఘీభావం తెలుపుతూ ట్వీట్‌ చేసింది. అయితే మతం, జాతి, భాష, పుట్టిన ప్రాంతం ఆధారంగా వివిధ గ్రూప్‌ల మధ్య శత్రుత్వాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారన్న కారణంతోపాటు విదేశాల నుంచి కుట్రలు సాగిస్తున్న ఆరోపణలతో ఆమెపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయినప్పటికీ వెనక్కు తగ్గని గ్రెటా ఇప్పటికీ రైతులకు మద్దతు ప్రకటిస్తున్నానని పేర్కొనడం గమనార్హం.

చదవండి: దిశను అందుకే అరెస్టు చేశారు: విన్సెంట్‌

గ్రెటా టూల్‌కిట్‌: బెంగళూరు యువతి అరెస్ట్‌

Videos

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌