amp pages | Sakshi

నేడు చివరి తేదీ: పాన్-ఆధార్ లింకు స్టేటస్ చెక్ చేసుకోండిలా!

Published on Wed, 03/31/2021 - 14:39

మీరు ఇంకా పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయలేదా? అయితే, వెంటనే చేయండి లేకపోతే ఏప్రిల్ 1 నుంచి మీ పాన్ కార్డ్‌కు ఎలాంటి విలువ ఉండదు. పాన్ నెంబర్ ను ఆధార్ నెంబర్ తో లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా కోరుతున్నది. అనేకసార్లు చివరి తేదీని పొడగించిన ప్రస్తుతం మరోసారి పొడిగించే దాఖలాలు కనబడటం లేదు. ప్రస్తుతం పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేయడానికి నేడు (2021 మార్చి 31) చివరి తేదీ. ఈ రాత్రిలోగా మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయాల్సిందే. లేకపోతే మీ దగ్గర పాన్ కార్డ్ ఉన్నా లావాదేవీల కోసం వాడుకోలేరు. ఒకవేళ మీరు గడువు తర్వాత పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేసినట్టైతే రూ.1,000 లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఫైనాన్స్ బిల్ 2021 లో నిబంధనను విధించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పాన్ కార్డుకు - ఆధార్ లింక్ చేసినట్లయితే ఈ-ఫైలింగ్ పోర్టల్ లింకు క్లిక్ చేసి ఆధార్,  పాన్ నెంబర్ సమర్పించి స్టేటస్ తెలుసుకోవచ్చు.

ఆధార్-పాన్ లింక్ విధానం:

  • ఐటి విభాగం ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను సందర్శించండి.
  • 'క్విక్ లింకులు' విభాగం కింద వెబ్‌పేజీకి ఎడమ వైపున ఉన్న 'లింక్ ఆధార్'పై క్లిక్ చేయండి.
  • ఆధార్ కార్డు ప్రకారం ఆధార్ నంబర్, మీ పేరు, పాన్ నెంబర్ వంటి వివరాలను నమోదు చేయండి.
  • పుట్టిన సంవత్సరాన్ని మాత్రమే మీ ఆధార్ కార్డులో పేర్కొన్నట్లయితే కింద ఉన్న చెక్ బాక్స్ పై టిక్ చేయండి.
  • 'నా ఆధార్ వివరాలను యుఐడిఏఐతో ధృవీకరించడానికి నేను అంగీకరిస్తున్నాను' అని ఉన్న బాక్స్ పై క్లిక్ చేయండి. 
  • మీ స్క్రీన్‌పై క్యాప్చా కోడ్‌ను ఎంటర్ స్క్రీన్ పై క్లిక్ చేయండి 
  • ఏదైనా దృశ్య లోపం ఉంటే వినియోగదారులు క్యాప్చా కోడ్‌కు బదులుగా వన్-టైమ్ పాస్‌వర్డ్ కోసం అభ్యర్థించవచ్చు. 
  • ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
  • 'లింక్ ఆధార్' బటన్ పై క్లిక్ చేస్తే ఇప్పుడు మీ ఆధార్, పాన్ లింక్ అవుతాయి.

చదవండి:

ఈ స్కీమ్ గడువు పొడగించిన ఎస్‌బీఐ 

ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు

Videos

పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..

సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో

ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు

రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు

కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి

ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ

YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..

8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..

రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్

సినిమా లవర్స్‌కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..

Photos

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)