amp pages | Sakshi

Tina Dabi: ఆమెది మళ్లీ లవ్‌ మ్యారేజ్‌!

Published on Fri, 04/22/2022 - 18:09

అందమైన ఆఫీసర్‌గా పేరున్న ఐఏఎస్‌ అధికారిణి టీనా దాబి రెండోసారి వివాహం చేసుకున్నారు. ఐఏఎస్ టీనా దాబీ, ఐఏఎస్ ప్రదీప్ గవాండే వివాహంతో శుక్రవారం ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితులు, బంధువులు సమక్షంలో వీరు పెళ్లి చేసుకున్నారు. టీనా, ప్రదీప్‌ల మ్యారేజ్‌ మరాఠీ సంప్రదాయం ప్రకారం జరిగింది. వివాహ కార్యక్రమంలో టీనా తెలుపు, బంగారు రంగు చీర ధరించగా, ప్రదీప్ కూడా తెల్లటి కుర్తా-పైజామాలో కనిపించాడు. కొద్దిమంది బంధువుల సమక్షంలో ఈ జంట కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

2015 ఐఏఎస్‌ బ్యాచ్‌లో టాపర్ అయిన టీనా దాబీ, డాక్టర్ ప్రదీప్ గవాండే (2013 ఐఏఎస్‌ బ్యాచ్) మే 2021లో మొదటిసారి కలుసుకున్నారు. ఈ జంట ప్రేమ మొదట స్నేహంతో ప్రారంభమైంది. టీనా, ప్రదీప్ కలిసి పనిచేస్తున్నప్పుడు మంచి స్నేహితులయ్యారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. దాదాపు ఏడాదిపాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. టీనా దాబి తనకు ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు మార్చిలో సోషల్‌ మీడియాలో ఫొటోలు షేర్‌ చేస్తూ ప్రకటించిన విషయం తెలిసిందే. తనకు కాబోయే భర్త, రాజస్థాన్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి ప్రదీప్‌ గవాండే అని వెల్లడించింది.

దుమారం రేపిన మొదటి వివాహం.. తర్వాత విడాకులు.. 
దళిత వర్గం నుంచి మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌ సాధించిన టీనా దాబి.. 2015 సివిల్స్‌ సర్వీసెస్‌ ఎంట్రెన్స్‌లో టాపర్‌. అయితే రెండో ర్యాంకర్‌ అయిన అథర్‌ అమీర్‌ ఖాన్‌తో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు 2016లో సోషల్‌ మీడియాలో ప్రకటించారు. ఆ సమయంలో మతపరమైన చర్చతో పెను దుమారమే చెలరేగింది. అయినా ఈ జంట వెనక్కి తగ్గలేదు. ఇక 2018లో వీళ్లిద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఈ జంట 2020లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం జైపూర్‌ కోర్టు నుంచి అధికారికంగా విడాకులు కూడా తీసుకున్నారు.

Videos

వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?