amp pages | Sakshi

ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో ముగిసిన పోలింగ్‌

Published on Fri, 11/17/2023 - 06:59

Updates..

ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో ముగిసిన పోలింగ్‌
►మధ్యప్రదేశ్‌లో 80 శాతానికి పైగా పోలింగ్‌ నమోదు
►ఛత్తీస్‌గఢ్‌లో 70 శాతానికిపైగా పోలింగ్‌ నమోదు

మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ ఇలా..
►ఛతీస్‌గఢ్‌లో 38.22 శాతం.
►మధ్యప్రదేశ్‌లో 45.40 శాతం.

► కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మధ్యప్రదేశ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు ఇష్టపడుతున్నారని చెప్పారు. 

►ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం, అంబికాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి టీఎస్ సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజ్‌మోహినీ దేవి బాలిక కళాశాలలో ఓటు వేశారు.   

►ఓటు వేసిన ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌. 
►ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒకరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి యువత ముందుకు రావాలన్నారు. 

►ఓటు వేసిన మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ 163 నంబర్‌ బూత్‌లో ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

►ఓటు వేసిన మాజీ సీఎం ఉమా భారతి. ఆమె స్వగ్రామం దుండా ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

►మధ్యప్రదేశ్‌లో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. 
►ఉదయం 9 గంటల వరకు  11.13 శాతం ఓటింగ్‌ నమోదైంది. 
► దిమాని  అసెంబ్లీ సెగ్మెంట్‌ళోని రెండు పోలింగ్ బూత్‌లపై రాళ్ల దాడి, ఒకరికి గాయాలు.
► కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌, ఇతర బీజేపీ నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సీఎం శివరాజ్‌ సింగ్‌ ప్రత్యేక పూజలు
►మధ్యప్రదేశ్‌ సీఎం, బీజేపీ నేత శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పోలింగ్‌ సందర్బంగా ప్రత్యేక పూజలు. సెహోర్‌లో నర్మదా ఘాట్‌ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఓటు వేసిన కమల్‌నాథ్‌
►మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ అభ్యర్థి కమల్‌నాథ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి ►వస్తుందన్నారు. ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని సూచించారు. 

►ఇండోర్‌-1 బీజేపీ అభ్యర్థి కైలాశ్‌ విజయ్‌వర్గీయ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
ఇండోర్‌లోని పోలింగ్‌ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. 

►కాంగ్రెస్‌ అభ్యర్థి కమల్‌నాథ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ గెలుస్తుంది. నాకు ప్రజల మీద నమ్మకముంది. బీజేపీ శివరాజ్‌సింగ్‌లా మేము ఇన్ని సీట్లలో గెలుస్తాము అని చెప్పను. ఎన్ని స్థానాల్లో గెలుపు అనేది ప్రజలే నిర్ణయిస్తారు. రాష్ట్రంలో పోలీసులు, వ్యవస్థ బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు. మరికొన్ని గంటలు మాత్రమే వారు ఇలా చేయగలరు. తర్వాత అంతా మారిపోతుంది. వారు డబ్బులు, లిక్కర్‌ పంచుతున్నట్టు నిన్ని నాకు కొన్ని కాల్స్‌, వీడియోలు వచ్చాయి. 

►ఉదయాన్నే పోలింగ్‌ కేంద్రాల వద్ద సందడి..
►ఓటు వేసేందుకు ఉదయాన్నే వచ్చిన ఓటర్లు..

►కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి ప్రహ్లద్‌ పటేల్‌ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌ ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. 100 శాతం పోలింగ్‌ నమోదు కావాలి ఇది నా విజ్ఞప్తి. ఐదోసారి రాష్ట్రంలో బీజేపీ గెలవబోతుంది. మాకు ఫుల్‌ మెజార్టీ వస్తుంది. 

►ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బఘేల్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మిగిలిన 70 స్థానాల్లో పోలింగ్‌ జరుగుతోంది. మీరు వేసే ఒక్క ఓటు.. రాష్ట్రంలో రైతులు, యూత్‌, మహిళల భవిష్యత్త్‌కు ఉపయోగపడుతుంది. అందుకే ప్రతీ ఒక్కరూ ఓటు వేయండి. ఛత్తీస్‌గఢ్‌ బంగారు భవిష్యత్త్‌ కోసం ఓటు వేయండి. 

►మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రారంభం.

►ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. కీలకమైన మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం ఒకే దశలో పోలింగ్‌ జరగనుంది.


►ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 సీట్లకు గాను రెండో, తుది దశలో భాగంగా 70 అసెంబ్లీ సీట్లకు కూడా పోలింగ్‌ జరుగుతుంది.


►ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్‌ 7న తొలి దశలో 20 నక్సల్స్‌ ప్రాబల్య స్థానాల్లో పోలింగ్‌ ముగిసింది. 

మధ్యప్రదేశ్‌లో..
మధ్యప్రదేశ్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 114 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. బీఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 15 నెలలకే జ్యోతిరాదిత్య సింధియా సారథ్యంలో 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో కుప్పకూలింది. శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సారథ్యంలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి ఆ రెండింటితో పాటు సమాజ్‌వాదీ పార్టీ కూడా మరోసారి గట్టిగా ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది.

ఛత్తీస్‌గఢ్‌ రెండో దశలో...
రాష్ట్రంలో 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెర దించి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 68 సీట్లతో కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించింది. ఈ ఐదేళ్లలో సీఎం భూపేశ్‌ బఘెల్‌ పలు ప్రజాకర్షక పథకాలతో రైతులతో పాటు అన్ని వర్గాలనూ ఆకట్టుకుంటూ వచ్చారు. అనంరం ఉప ఎన్నికల విజయాలతో అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం 71కి పెరిగింది. ఈసారి బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు బీఎస్పీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా పోటీలో ఉన్నాయి.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)