amp pages | Sakshi

మార్కెట్లోకి పళ్ల రారాజు.. వామ్మో! కిలో హాపస్ మామిడి ధర రూ.2000?

Published on Wed, 03/22/2023 - 12:36

వేసవికాలం ప్రారంభమైంది. అంటే మామిడి పండ్ల సీజన్‌ కూడా వచ్చేసినట్లే. మామిడి పండు రుచికి ఏ పండు సాటిరాదు. అందుకే ఇది పండ్ల రాజు అయింది. ఏటా ఒక్కసారి మాత్రమే అందుబాటులోకి వచ్చే ఈ పండ్లను ఎప్పుడు ఎప్పుడు రుచి చుద్దామా.. అని ఎదురుచూస్తూ ఉంటారు. ప్రస్తుతం చెట్ల మీద పండే దశలో ఉన్నాయి.మరో నెల రోజులు ఆగితే ఎన్నో రకాల పండ్లు ప్రతి మార్కెట్లోనూ విరివిగా అందుబాటులోకి రానున్నాయి.

అయితే ఇప్పటికే భారత్‌లోని పలుప్రాంతాల్లో మామిడి పండ్లు వచ్చేశాయి. ఇతర రాష్ట్రాల నుంచి బిహార్‌లోని పాట్నా మార్కెట్‌లోకి అడగుపెట్టాయి. సాధారణంగా మామిడి పండు వెరైటీని బ‌ట్టి వాటి ధ‌ర ఉంటుంది  మనకు తెలిసినంత వరకు కేజీ వంద రూపాయలదాకా ఉంటుంది. కానీ ప్రస్తుతం తక్కువ సంఖ్యలో పండ్లు అందుబాటులో ఉండడంతో కిలో ధర రూ.350 నుంచి రూ.500 పలుకుతున్నాయి. మరి కొన్ని రకాల మామిడికాయలు రూ.150 నుంచి 200 వరకు విక్రయిస్తున్నారు.

ముంబై, ఒరిస్సా, ఢిల్లీ నుంచి మామిడిపండ్లు వస్తున్నాయి.ప్రస్తుతం డిమాండ్ తక్కువగా ఉన్నప్పటికీ.. త్వరలో విక్రయాలు పుంజుకుంటాయని పాట్నాలోని  ఫ్రూట్ మార్కెట్‌లో  పండ్లు అమ్మే ఓ వ్యక్తి తెలిపారు. ఒడిశాలోని మాల్డా, మహారాష్ట్రకు చెందిన ప్యారీతో సహా గులాబ్ఖాస్ మామిడి అందుబాటులో ఉన్నాయి. ఈ పండ్ల ధర కిలో రూ. 350 నుండి రూ. 500 వరకు ఉంది. అంతేగాక ఈ రకం పండు ఒక్క కాయ ధర ఏకంగా  రూ.150-200 వరకు అమ్ముడవుతోంది! 

అల్ఫోన్సో లేదా హాపస్ అని కూడా పిలువబడే పండు మామిడి పండ్లలోనే అత్యుత్తమ రకంగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం ఈ మామిడి పండ్లను ఇన్‌కమ్ ట్యాక్స్ గోలంబర్ ప్రాంతంలో డజను రూ.1500 నుంచి రూ.2000 వరకు విక్రయిస్తున్నారు. అల్ఫోన్సో GI ట్యాగ్ కూడా అందుకుంది. ఈ  పండ్లకున్న ప్రత్యేక రుచి, సువాసన, తీపి కారణంగా  జనాలు వీటిని ఎక్కువగా ఇష్టపడతారు.

అంతేగాక హాపస్ మామిడి పండిన తర్వాత వారం రోజుల పాటు పాడవకుండా ఉంటాయి. ఇవి మహారాష్ట్రలోని రత్నగిరి, సింధుదుర్గ్  పరిసర ప్రాంతాల్లో పండిస్తారు. ఈ రకం పండ్లు అన్ని చోట్లా దొరకవు. కొన్ని ప్రత్యేక  స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే ఇది రాబోయే 10, 20 రోజుల్లో అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)