amp pages | Sakshi

Mimi Chakraborty: నకిలీ వ్యాక్సిన్‌.. నటికి అస్వస్థత

Published on Sun, 06/27/2021 - 02:14

కోల్‌కతా: కోవిడ్‌–19 నకిలీ వ్యాక్సిన్‌ తీసుకున్న నటి, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మిమి చక్రవర్తి అస్వస్థతకు లోనయ్యారు. ఆమె కడుపు నొప్పి, లో బీపీ, డీ హైడ్రేషన్‌తో బాధపడుతున్నట్టుగా శనివారం  ఆమె సన్నిహితులు వెల్లడించారు. అయితే నకిలీ వ్యాక్సిన్‌ తీసుకున్నందువల్లే ఆమె అనారోగ్యం బారిన పడ్డారా అన్నది డాక్టర్లు ధృవీకరించాల్సి ఉంది..

‘‘ప్రస్తుతానికి మీమీ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఆమె ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. ఆమె అనారోగ్యానికి కారణం నకిలీ వ్యాక్సినేనా అన్నది ఇప్పుడే చెప్పలేమని మిమికి చికిత్స చేసిన వైద్యుడు వెల్లడించారు. హైపర్‌ టెన్షన్‌తో ఆమె బాధపడుతున్నార’’ ని మిమి సన్నిహితులు తెలిపారు. కాగా, 32 ఏళ్ల మిమి గత కొంతకాలంగా లివర్‌ సంబంధిత జబ్బుతో బాధపడుతున్నారు.

జాదవ్‌పూర్‌ పార్లమెంటు సభ్యురాలు మిమి చక్రవర్తిని ఐఎఎస్‌ అధికారిగా చెప్పుకున్న దేబాంజన్‌ దేబ్‌ అనే వ్యక్తి కరోనా టీకా కేంద్రానికి ముఖ్య అతిథి ఆహ్వానించడంతో ఆమె వెళ్లి టీకా  తీసుకున్నారు. అయితే వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ రాకపోవడంతో మిమి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించగా అది నకిలీ వ్యాక్సిన్‌ కాంప్‌ అని తేలిన విషయం తెలిసిందే.

చదవండి: నటికి టోకరా ఇలా...

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?