amp pages | Sakshi

కొత్త సీపాప్‌ మెషీన్‌: కరోనా బాధితులకు వరం?

Published on Mon, 06/14/2021 - 17:35

సాక్షి, చండీగఢ్‌‌: కరోనా సెకండ్‌వేవ్‌లో ఆక్సిజన్‌ కొరతతో కరోనా బాధితుల కష్టాలు వర్ణనాతీతం. ఊపిరాడక తమ కళ్లముందే ఆత్మీయులు విలవిల్లాడుతోంటే కుటుంబ సభ్యుల ఆవేదన ఇంతా కాదు.   ఒక మాదిరి నుంచి తీవ్రంగా ప్రభావితమైన కరోనా బాధితుల్లో సీపాప్‌ థెరపీ చాలా కీలకంగా మారింది. అయితే ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్లు, సీపాప్‌, బీపాప్ మెషీన్లు ఖరీదైనవిగావటం బాధిత కుటుంబాల్లో మరింత ఆందోళన రేపింది. అయితే జీవన్‌ వాయు పేరుతో రూపొందించిన ఒకకొత్త సీపాప్‌ డివైస్‌ వివరాలను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపర్ ( ఐఐటి రోపర్ )ట్వీట్‌ చేసింది.  

చాలా తక్కువ రేటులో సీపాప్‌ను మెషీన్‌ మోడల్‌ రూపొందించడం ఒక ప్రత్యేకత అయితే..విద్యుత్‌ అవసరం లేకుండానే పనిచేయడం మరో విశేషం. ఐఐటీ రోపార్‌కు చెందిన అసిస్టెంట్‌  ప్రొఫెసర్‌ ఖుష్బూరాక దీన్ని డిజైన్‌ చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా విద్యుతు అవసరం లేకుండానే అతి తక్కువ ఖర్చుతో దీన్ని తయారు చేసినట్టు రాక వెల్లడించారు. నిమిషానికి 15 లీటర్లు ఆక్సిజన్‌ అందిస్తుండగా, తమ డివైస్‌ ద్వారా నిమిషానికి 16 లీటర్లు దాకా అందిచ వచ్చన్నారు.  అంతేకాదు దీన్ని 3 వేల రూపాయలలోపే దీన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.  ‘జీవన్ వాయు’ పేరుతో అభివృద్ధి చేసిన ఈ మెషీన్‌ ద్వారా గ్రామాలు, సౌకర్యాలు కొరత వున్న గ్రామాల నుంచి అంబులెన్స్ ద్వారా ఆసుపత్రులకు చేరేవారి ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. ​సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పీఈసీ భాగస్వామ‍్యంతో ఈ పరికరాన్ని తయారుచేసినట్టు వెల్లడించారు. అన్ని అనుమతులు లభిస్తే..  త్వరలోనే దీన్ని కమర్షియల్‌గా అందుబాటులోకి తీసుకొస్తామని ఆమె చెప్పారు.

Videos

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌