amp pages | Sakshi

అధికార మదం.. డబ్బుల్ని పోలీసులపైకి విసిరికొట్టిన ఎమ్మెల్యే

Published on Thu, 06/17/2021 - 08:11

రూర్కీ: అధికార మదంతో ఓ ఎమ్మెల్యే పోలీస్‌ అధికారిపై డబ్బులు విసిరికొట్టిన ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు ఛలానా కట్టమన్న అధికారులపై తన ఆక్రోశం వెల్లగక్కాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో ఆ బీజేపీ ఎమ్మెల్యే తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఉత్తరాఖండ్‌ బీజేపీ ఎమ్మెల్యే ప్రదీప్‌ బత్రా ఆదివారం సాయంత్రం తన కుటుంబంతో కలిసి షికారుకు వెళ్లాడు. ఆ టైంలో ముస్సోరి దగ్గర మాల్‌ రోడ్‌లో ఆయన కారును పోలీసులు ఆపారు. కొవిడ్‌ రూల్స్‌ ప్రకారం..బయట తిరిగే టైం ముగియడంతో పాటు ఆ టైంలో బత్రా మాస్క్‌ పెట్టుకోలేదని చెబుతూ పోలీసు అధికారి ఒకరు ఛలానా రాశాడు. అయితే తాను ఎమ్మెల్యేనని, తనకే ఛలానా రాస్తారా? అంటూ అధికారులపై ఊగిపోయాడు ప్రదీప్‌. అయినప్పటికీ ఆ అధికారి మాత్రం ఛలానా కట్టాల్సిందేనని స్పష్టం చేశాడు. దీంతో కారులోంచి డబ్బు తెచ్చి పోలీసులపై విసిరి.. ‘ఎంత కావాలో తీసుకో!’ అంటూ.. ఎమ్మెల్యే ప్రదీప్‌ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయాడు.

ఇక అక్కడే ఉన్న ఓ ‍వ్యక్తి ఆ ఘటనను వీడియో తీసి..  వైరల్‌ చేశాడు. దీంతో ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం మొదలైంది. పోలీస్‌ అధికారికి ఆ ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మరోవైపు ఉత్తరాఖండ్‌ పోలీసుల సంఘం ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేసింది. అయితే ఆ టైంలో తాను, తన కుటుంబం మాస్క్‌ పెట్టుకునే ఉన్నామని, ఐడీ కార్డు చూపించినా ఆ అధికారి వినలేదని, పైగా పోలీసులే తనతో దురుసుగా ప్రవర్తించారని ప్రదీప్‌ చెప్తున్నాడు. ఇక  ఈ  ఘటనలో అధికారి తన డ్యూటీ సక్రమంగా చేశాడని, విమర్శల నేపథ్యంలో ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేపడతామని ఉన్నతాధికారులు తెలిపారు.

చదవండి: గాడిదపై తిరుగుతున్నారేమో!

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)