amp pages | Sakshi

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, విసర్జించినా

Published on Fri, 07/31/2020 - 07:54

‘కరోనా వైరస్‌ రోజురోజుకీ విస్తరిస్తోంది. ఇలాంటి సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, మూత్ర విసర్జన చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి’ అని కోరుతూ మద్రాసు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. ఈ పిల్‌పై నాలుగు వారాల్లోగా బదులివ్వాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.  

సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నైకి చెందిన రాజ్‌కుమార్‌ అనే న్యాయవాది దాఖలు చేసిన పిల్‌ పిటిషన్‌లోని వివరాలు ఇలా ఉన్నాయి. 1939లో అమల్లోకి వచ్చిన ప్రజారోగ్యచట్టం ప్రకారం ప్రజలకు ఆరోగ్యవసతులు కల్పించాల్సి ఉంది. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం, ఉమ్మేయడం, వీధుల్లో చెత్త వేయడంపై నిషేధం విధిస్తూ 2002లో మరో చట్టం వచ్చింది. కాగితాలకే పరిమితమైన ఈ చట్టా న్ని అమలు చేసేందుకు తీవ్రమైన చర్యలు చేపట్టాలి. తమిళనాడులో జనాభా దామాషా ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మరుగుదొడ్లు లేవు. ఉన్న మరుగుదొడ్లకు పర్యవేక్షణ లేదు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయడం, మూత్ర విసర్జన నిరోధించలేకపోయారు. కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, మూత్ర విసర్జన చేసినా శిక్షించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి. వైద్యవ్యర్థాలు, ప్లాస్టిక్‌ వస్తువులను శాస్త్రీయంగా విభంజించి నిర్మూలించాలి. ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో తగిన మరుగుదొడ్ల వసతి ఉందోలేదో తనిఖీ చేయాలి. ఘనవ్యర్థాల మేనేజ్‌మెంట్‌ విధులను కఠినంగా అమలుచేయాలి. వీధుల్లో నివసించే వారిని కేటగిరి వారీగా విభజించి శరణాలయాలకు తరలించి కరోనా పరీక్షలు నిర్వహించాలి అని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌  న్యాయమూర్తులు ఎంఎం సుందరేష్, హేమలతతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ముందుకు వచ్చింది. సదరు పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా బదులివ్వాలని న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని ఆదేశించారు.    

ఒకటి నుంచి మాస్క్‌ల పంపిణీ 
ఇంటింటికీ ఉచిత మాస్కుల పంపిణీకి ఆగస్టు 1వ తేదీ నుంచి టోకెన్ల పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఎన్నిమార్లు ప్రచారం చేసినా ప్రజల్లో అధిక శాతం మాస్కులు ధరించనందునే రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిస్థితిని నివారించేందుకు రేషన్‌ దుకాణాల ద్వారా ఉచితంగా రెండు మాస్కుల చొప్పున పంపిణీ చేయాలని సంకల్పించింది. మాస్కుల పంపిణీ సులువుగా సాగేందుకు రేషన్‌ దుకాణదారులు వచ్చే నెల 1, 2, 3 తేదీల్లో ఇంటింటా టోకన్లు పంపిణీ చేయనున్నట్టు గురువారం తెలిపింది. ఇదిలావుండగా లాక్‌డౌన్‌ కారణంగా అమెరికా, నెదర్లాండ్, సౌదీ, కతర్, జపాన్, థాయ్‌లాండ్‌ దేశాల్లో చిక్కుకున్న 834 మంది భారతీయులు ఆరు ప్రత్యేక విమానాల ద్వారా గురువారం చెన్నైకి చేరుకున్నారు. 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)