amp pages | Sakshi

దేశంలో తగ్గిన బిలియనీర్ల సంఖ్య

Published on Tue, 08/10/2021 - 19:26

మన దేశంలో బిలియనీర్ల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఆదాయపు పన్ను రిటర్న్ లో ప్రకటించిన స్థూల మొత్తం ఆదాయం ఆధారంగా 2019-20లో 141గా కుబేరుల సంఖ్య 2020-21లో 136కు తగ్గిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటుకు తెలిపారు. 2018-19లో ఈ సంఖ్య 77గా ఉందని ఆమె రాజ్యసభకు ఇచ్చిన సమాధానంలో తెలిపారు. అంటే కేవలం రెండు ఏళ్లలో బిలియనీర్ల సంఖ్య రెండు రేట్లు అయ్యింది.

"సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ)లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ప్రత్యక్ష పన్నుల కింద బిలియనీర్ అనే పదానికి చట్టపరమైన లేదా పరిపాలనా నిర్వచనం లేదు. 01.04.2016లో సంపద పన్ను రద్దు చేయడం వల్ల సీబీడీటీ వ్యక్తిగత పన్ను చెల్లింపుదారు సంపద గురించి పూర్తి సమాచారం లేదు" అని ఆమె అన్నారు. మాజీ టెండూల్కర్ కమిటీ పేదరిక అంచనాల ప్రకారం, భారతదేశంలో దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న వారి సంఖ్య 20011-12లో 27 కోట్లు(21.9 శాతం)గా అంచనా వేయబడింది. 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్'కు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం, ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి & సమ్మిళిత అభివృద్ధిని పెంపొందించడానికి అనేక పథకాలను ప్రారంభించినట్లు ఆమె చెప్పారు.

2020-21 ఆర్థిక సర్వేలో పేర్కొన్న విధంగా.. తాగునీరు, పారిశుధ్యం, పరిశుభ్రత, గృహ పరిస్థితి కనీస అవసరాల విషయంలో 2012 నుంచి 2018 వరకు పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది, గ్రామీణ & పట్టణ ప్రాంతాలలోని సంపన్న కుటుంబాలతో పోలిస్తే పేద కుటుంబాలకు అసమానత భారీగా తగ్గినట్లు సీతారామన్ తెలిపారు. అలాగే మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. ధరల పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని, ధరల స్థిరత్వాన్ని కొనసాగించడానికి తగిన చర్యలు తీసుకుంటుందని ఆర్థిక మంత్రి తెలిపారు. వంటనూనెలపై దిగుమతి సుంకాలను తగ్గించడం, పప్పుధాన్యాల నిల్వలపై పరిమితి విధించినట్లు తెలిపారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌