amp pages | Sakshi

రాహుల్‌పై అనర్హత వేటు.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు

Published on Sat, 03/25/2023 - 11:04

న్యూఢిల్లీ: రాహుల్‌ గాంధీ అనర్హత వేటు నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పీహెచ్‌డీ స్కాల‌ర్, కేరళకు చెందిన సామాజిక కార్య‌క‌ర్త ఆబా ముర‌ళీధ‌ర‌న్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్‌8(3) ‘ఆటోమేటిక్‌ అనర్హత’ రాజ్యాంగ చెల్లుబాటును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. 

ఎన్నికైన ప్రజాప్రతినిధులపై నేరం రుజువైన వెంటనే అనర్హత వేటు వేయడం చట్ట విరుద్దమని పిటిషన్‌లో పేర్కొన్నారు. పరువు నష్టం కేసులో శిక్షలను చట్టం నుంచి మినహాయించాలని విన్నపించారు. ఆటోమెటిక్‌గా ప్ర‌జాప్ర‌తినిధుల్ని అన‌ర్హులుగా ప్ర‌క‌టించే సెక్ష‌న్ 8 విష‌యంలో దిశానిర్దేశం చేయాల‌ని ముర‌ళీధ‌ర‌న్ పిటిష‌న్‌లో కోరారు. ఈ సెక్ష‌న్ అక్ర‌మంగా, ఏక‌ప‌క్షంగా ఉంద‌ని ఆరోపించారు.

ప్రజాప్రాతినిధ్య‌ చట్టంలోని సెక్ష‌న్ 8(3)ను న్యాయ‌స‌మ్మ‌తం లేకుండా రూపొందించార‌ని, అది రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌న్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల భావ స్వేచ్ఛ‌ను హ‌రిస్తోంద‌న్నారు. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు త‌మ ఓట్ల‌తో నేత‌ల్ని ఎన్నుకున్నార‌ని, కానీ ఆ చ‌ట్టం వ‌ల్ల ఆ నేత త‌న విధుల్ని స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌లేక‌పోతున్న‌ట్లు త‌న పిటిష‌న్‌లో తెలిపారు. ఈ పిటిషన్‌పై సుప్రీం వచ్చే వారం విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

కాగా 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ‘దొంగలందరి ఇంటి పేరూ మోదీయే ఎందుకుంటుందో’ అని వ్యాఖ్యానించిన కేసులో సూరత్‌ కోర్టు కాంగ్రెస్‌ నాయకుడు, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ను దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించడం తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంటూ లోక్‌సభ సెక్రటేరియట్‌ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 
చదవండి: Rahul Gandhi: రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు రాజ్యాంగబద్ధమేనా?

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)