amp pages | Sakshi

CEC bill: పంతం నెగ్గించుకున్న కేంద్రం

Published on Tue, 12/12/2023 - 20:34

సాక్షి, ఢిల్లీ: విపక్షాల తీవ్ర అభ్యంతరాల నడుమ..  కేంద్రం ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకుంది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో భాగంగా.. రాజ్యసభలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక బిల్లుకు ఆమోదం లభించింది. ప్రతిపక్ష సభ్యుల వాకౌట్‌ నడుమే బిల్లుకు ఆమోదం లభించింది. తద్వారా కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల సెలక్షన్‌ కమిటీలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బదులు.. కేంద్ర మంత్రిని తీసుకొచ్చింది.  

కేంద్ర ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి బదులు కేబినెట్ మంత్రిని చేరుస్తూ బిల్లు రూపకల్పన చేసింది కేంద్రం. ఆ మంత్రి పేరును కూడా ప్రధానినే నామినేట్‌ చేస్తారు. తద్వారా 1991 చట్టాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేసింది.  అయితే ఈ ఏడాది మార్చిలో సుప్రీం కోర్టు.. ‘‘ఎన్నికల కమిషనర్ల నియామకాలపై పార్లమెంటులో చట్టం చేసేవరకు.. ప్రధానమంత్రి నేతృత్వంలో లోక్‌సభలో విపక్ష నేత, సీజేఐ కలిసి ఈ నియామకాలు చేపట్టాలని’’ తీర్పునిచ్చింది. అయినప్పటికీ కేంద్రం ముందుకే వెళ్లింది.

అయితే, తాజాగా మంగళవారం రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ బిల్లును ప్రవేశపెట్టి.. విపక్షాల అభ్యంతరాలు బదులు ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇక మీదటా స్వతంత్రంగానే పని చేస్తుందని అన్నారాయన. ‘‘కేంద్రం తెచ్చిన బిల్లు అత్యున్నత న్యాయస్థానం తీర్పు దిశకు అనుగుణంగా ఉంది. రాజ్యాంగంలో పొందుపరిచిన అధికార విభజనకు తగ్గట్లు ఉంది’’ అని తెలిపారు.  

రాజ్యసభ ఆమోదం పొందిన సీఈసీ బిల్లు ప్రకారం.. ఈసీ, ఈసీ సభ్యుల నియామకాల కోసం ప్రధాని నేతృత్వంలో త్రిసభ్య సంఘం ఏర్పాటవుతుంది. దీనిలో లోక్‌సభ విపక్ష నేత, ప్రధాని నియమించే ఒక కేబినెట్‌ మంత్రి సభ్యులుగా ఉంటారు. ఈ ప్రతిపాదిత కమిటీపైనా విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. 

వాస్తవానికి ఈ బిల్లును ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీనే రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. అప్పుడు దీనిపై ఎలాంటి చర్చ జరగలేదు. ఆ తర్వాత సెప్టెంబరులో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో బిల్లును తీసుకురావాలని భావించినా.. అది సాధ్యపడలేదు. తాజాగా సవరణలతో కూడిన ఈ బిల్లు మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టడం.. చర్చ జరగడం.. విపక్షాల అభ్యంతరాల నడుమే ఆమోదం పొందడం జరిగాయి.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)