amp pages | Sakshi

కిల్లర్‌ బామ్మ.. మీ ముందు హీరోయిన్లంతా దిగదుడుపే

Published on Thu, 02/18/2021 - 21:00

మనిషి జీవితంలో వయసు అనేది కేవలం ఓ నంబర్‌ మాత్రమే అంటారు చాలా మంది. కలలు సాకారం చేసుకోవాలనుకువారు.. ఇష్టమైన రంగాల్లో రాణించాలనుకునే వారు వయసును పెద్దగా పట్టించుకోరు. ఒకప్పుడు కోల్పోయిన అవకాశాలను మళ్లీ అందిపుచ్చుకుంటారు. ఎవరేమనుకుంటారో అనే విషయాన్ని పట్టించుకోరు. తమ మనసుకు నచ్చిన పని చేస్తూ.. సంతోషంగా ఉంటారు. ఇలాంటి వారికే త్వరగా గుర్తింపు దక్కుతుంది. ఇందుకు ఉదాహరణలు మన చుట్టు కొకొల్లలు. 

ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే తాజాగా సోషల్‌ మీడియా ఓ బామ్మను ఓవర్‌నైట్‌లో సెలబ్రిటీగా మార్చింది. 60 ఏళ్ల రవి బాల శర్మ అనే ఈ బామ్మ డ్యాన్స్‌కు నెటిజనులతో పాటు సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. తన హవభావాలు, డ్యాన్స్‌ మూవ్‌మెంట్స్‌తో అదరగొడుతున్నారు బామ్మ. ప్రస్తుతం ‘‘డ్యాన్సింగ్‌ దాదీ’’ పేరుతో ఈ బామ్మ డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతియాజ్‌ అలీ, దిల్జిత్‌ దోసాంజ్‌ వంటి వారు బామ్మ డ్యాన్స్‌కు ఫ్యాన్స్‌ అయ్యారు. ఈమె డ్యాన్స్‌ వీడియోలు చూసిన వారంతా ‘‘బామ్మ మీ ముందు హీరోయిన్లంతా దిగదుడుపే’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 

ఈ సందర్భంగా రవి బాలా శర్మ మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. అవకాశం దొరికితే చాలు గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని డ్యాన్స్‌ చేసేదాన్ని. కానీ దానిలో రాణించే అవకాశం లభించలేదు. ఇలా ఉండగానే వివాహం అయ్యింది. ఆ తర్వాత పిల్లలు, కుటుంబ బాధ్యతలతో సరిపోయింది. దాంతో డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ మూలన పడింది’’ అంటూ చెప్పుకొచ్చారు.

‘‘ఇలా ఉండగానే నా భర్త మరణించారు. ఆ షాక్‌ నుంచి కోలుకోలేకపోయాను. డిప్రెషన్‌లోకి వెళ్లాను. నన్ను మాములు మనిషిని చేయడం కోసం నా పిల్లలు డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ మొదలుపెట్టమని బలవంతం చేశారు. నన్ను గొప్ప డ్యాన్సర్‌గా చూడాలని నా భర్త కోరుకునేవాడు. ఆయన కల నేరవేర్చడం కోసం మళ్లీ ప్రాక్టీస్‌ మొదలు పెట్టాను’’ అంటూ చెప్పుకొచ్చారు.

‘‘ఈ క్రమంలో నా సోదరి ఓ సారి నన్ను ఆడిషన్‌కి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాను. ఆశ్చర్యం చాలా మంది నన్ను ప్రశంసించారు. బాగా చేశానని మెచ్చుకున్నారు. వారి ప్రశంసలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. అప్పటి నుంచి క్రమం తప్పకుండా డ్యాన్స్‌ వీడియోలు పోస్ట్‌ చేస్తుండేదాన్ని. ఓ వీడియోకు ఏకంగా ఆరు లక్షల వ్యూస్‌ వచ్చాయి. దీన్ని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు’’ అన్నారు. 

‘‘నా కల నిజం అవుతుందని కానీ.. ఈ వయసులో ఇంత పేరు, ప్రఖ్యాతులు సంపాదిస్తానని కానీ నేను కలలో కూడా ఊహించలేదు. నన్ను ప్రోత్సాహిస్తున్నవారందరికి ధన్యవాదాలు. వయసు మీద పడిందని బాధ పడకండి. అది కేవలం ఓ నంబర్‌ మాత్రమే. కలలను సాకారం చేసుకోవడానికి వయసుతో పని లేదు’’ అంటూ చెప్పుకొచ్చారు ఈ బామ్మ. 

చదవండి: మాధురీ దీక్షిత్‌ను ఫిదా చేసిన యువతి

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)