amp pages | Sakshi

చిరుతల కోసం 'పులి విమానం'.. ఫోటోలు వైరల్..

Published on Thu, 09/15/2022 - 17:04

న్యూఢిల్లీ: భారత్‌కు 8 చీతాలను(చిరుతలు) తీసుకొచ్చేందుకు ప్రత్యేక జంబో జెట్ నమీబియా రాజధాని విండ్‌హోక్‌కు వెళ్లింది. భారీ పరిమాణంలో ఉన్న ఈ కస్టమైజ్డ్ విమానం ముందు భాగాన్ని పులి ఫోటోతో తీర్చిదిద్దారు. ఆకర్షణీయంగా ఉన్న ఈ విమానం ఫోటోలను నమీబియాలోని భారత రాయబార కార్యాలయం బుధవారం ట్వీట్ చేసింది. చిరుతలను భారత్‌కు తీసుకొచ్చేందు 'టైగర్ విమానం' విండ్‌హోక్‌లో ల్యాండ్ అయిందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ 8 చిరుతలు సెప్టెంబర్ 17న భారత్‌కు రానున్నాయి. మొదట రాజస్థాన్‌లో ల్యాండ్‌ అయి, ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో వీటిని విడుదల చేస్తారు. మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. 8 చిరుతల్లో ఐదు మగవి కాగా.. మూడు ఆడవి.

అంతరించిపోయిన జాతి..
ఈ అరుదైన చిరుతలు దేశంలో అంతరించిపోయినట్లు 1952లోనే భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర‍్వాత వీటిని పునరుత్పత్తి చేసేందుకు ఇతర దేశాల నుంచి చిరుతలను భారత్‌కు తీసుకురావడానికి 1970 నుంచి ప్రయత్నాలు జరిగినప్పటికీ ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు ఈ ఏడాది జులైలో నమీబియాతో ఒప్పందం కుదుర్చుకుంది భారత్ ప్రభుత్వం. ఇంటర్‌కాంటినెంటల్ ట్రాన్స్‌లొకేషన్ ప్రాజెక్టులో భాగంగా 8 చిరుతలను నమీబియా నుంచి తీసుకొస్తోంది.

ఈ ప్రాజెక్టు కోసమే పులి విమానాన్ని తయారు చేశారు. ఇందులో చిరుతల కోసం ప్రత్యేకంగా బోనులు ఏర్పాటు చేశారు. అంతేకాదు 16 గంటల పాటు ఈ విమానం నిర్విరామంగా ప్రయాణించి భారత్‌కు చేరుకోనుంది. మధ్యలో ఎక్కడా ఇంధనం కోసం కూడా ఆగాల్సిన అవసరం లేకుండా దీన్ని రూపొందించారు. ఈ 16 గంటలు చిరుతలకు ఎలాంటి ఆహారం అందించరు. గాల్లోనే ప్రయాణిస్తున్నందున వాటికి న్యూయేసియా వంటి సమస్యలు రాకుండా సిబ్బంది ఈ నిర్ణయం తీసుకున్నారు.
చదవండి: నితీశ్ కుమార్‌తో దోస్తీపై ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)