amp pages | Sakshi

వీడియో: ‘బీటెక్‌ చాయ్‌వాలి’.. ఆమె థింకింగ్‌ వేరె లెవల్‌ గురూ..

Published on Fri, 10/14/2022 - 10:29

ఆలోచన ఉండాలే గానీ.. జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని ఇప్పటికే ఎందరో నిరూపించి తమ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పారు. తాజాగా చదువు అనేది కేవలం ఉద్యోగం చేయడానికి మాత్రమే కాదని ఓ యువతి.. తన కలలను నిజం చేసుకుంది. సొంతంగా బీటెక్‌ చాయ్‌వాలి అనే పేరుతో ఓ టీ షాప్‌ ఓపెన్‌ చేసింది.  ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన వర్తికా సింగ్‌ హర్యానాలో తన బీటెక్‌ పూర్తి చేసింది. కాగా, తాను చదువుకుంటున్న సమయంలో సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది. దీంతో, తన కలను సాకారం చేసుకునేందుకు ఓ వినూత్న ఆలోచన చేసింది. సొంతంగా ఓ టీ షాప్‌ను ప్రారంభించింది. సదరు షాప్‌నకు ‘బీటెక్‌ చాయ్‌వాలీ’ అని పేరుపెట్టింది. దీంతో, వ్యాపారం ప్రారంభించినట్టు పేర్కొంది. 

ఈ క్రమంలో వర్తికా సింగ్‌ మాట్లాడుతూ.. సొంత వ్యాపారం చేయాలనుకోవడం నా డ్రీమ్‌. అందులో భాగంగానే ఫరీదాబాద్‌లోని గ్రీన్‌ఫీల్డ్‌ వద్ద ‘బీటెక్‌ చాయ్‌వాలీ’ని ప్రారంభించాను. ప్రతీరోజు సాయంత్రం 5:30 నుండి రాత్రి 9:30 గంటల వరకు టీ షాప్‌ను నడుపుతున్నాను. ‘బీటెక్‌ చాయ్‌వాలీ’తో ఎంతో సంతృప్తి చెందాను అంటూ చెప్పుకొచ్చింది. 

మరోవైపు.. గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాంతంలో ‘బీటెక్‌ చాయ్‌వాలీ’ ఎంతో ఫేమస్‌ అయ్యింది. ఈ షాప్‌లో స్పెషల్‌ టీ, మసాలా టీ తాగేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, బీటెక్‌ చాయ్‌వాలీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ నిలిచింది. దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. మీ చిరునవ్వు, విశ్వాసం నాకు నచ్చింది. నేను మీ కోసం ప్రార్థిస్తాను అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. మరో నెటిజన్‌ స్పందిస్తూ.. రాబోయే ఒక్క సంవత్సరంలో మీరు బ్రాండ్ అవుతారు అంటూ వ్యాఖ్యలు చేశారు.

Videos

ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు

దొంగలు దొరికారు

రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్

హిందూపురానికి బాలకృష్ణ చేసిందేమీ లేదు.. అందుకే ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు

జగనన్న సంక్షేమమే నన్ను గెలిపిస్తుంది..175/175 పక్కా

సీఎం రమేష్ ను కలవడంపై కొమ్మినేని విశ్లేషణ

అప్పుడు కరెక్ట్.. ఇప్పుడు రాంగ్ ఎలా..బయటపడ్డ టీడీపీ కుట్ర

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ

రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌